హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi 9: రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Redmi 9: రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Redmi 9: రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Redmi 9: రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Redmi 9 Smartphone release | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10,000 లోపేనా? ఈ బడ్జెట్‌లో షావోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వివరాలు తెలుసుకోండి.

  షావోమీ నుంచి ఇటీవలే రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్మార్ట్‌ఫోన్ పరిచయం చేస్తామని ప్రకటించింది రెడ్‌మీ ఇండియా. ఆగస్ట్ 4న మధ్యాహ్నం 12 గంటలకు కొత్త డివైజ్ లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది. షావోమీ రిలీజ్ చేయబోయేది రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ కావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆగస్ట్ 6న అమెజాన్ ఇండియాలో ప్రారంభమయ్యే ప్రైమ్ డే సేల్ సందర్భంగా రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది షావోమీ. రెడ్‌మీ 9 గతంలో చైనాలో రిలీజ్ అయింది. కాబట్టి ఫీచర్స్ అందరికీ తెలిసినవే. మీడియాటెక్ హీలియో జీ80 ఆక్టాకోర్ ప్రాసెసర్, 5,020ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  రెడ్‌మీ 9 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  డిస్‌ప్లే: 6.53 ఫుల్ హెచ్‌డీ+

  ర్యామ్: 4జీబీ, 6జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ80

  రియర్ కెమెరా: 13+8+5+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 8మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,020ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: కార్బన్ బ్లాక్, నియాన్ బ్లూ, లోటస్ రూట్ పౌడర్, మోర్డీసిన్

  ధర:

  4జీబీ+64జీబీ- సుమారు రూ.8,500

  4జీబీ+128జీబీ- సుమారు రూ.10,600

  6జీబీ+128జీబీ- సుమారు రూ.12,800

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Redmi, Smartphone, Xiaomi

  ఉత్తమ కథలు