Poco X2: రియల్‌మీకి షాక్... తక్కువ ధరకే 'పోకో ఎక్స్2' స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Poco X2 Release | రూ.15,000 బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. పోకో ఎక్స్2 ఇండియాలో రిలీజైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 4, 2020, 1:20 PM IST
Poco X2: రియల్‌మీకి షాక్... తక్కువ ధరకే 'పోకో ఎక్స్2' స్మార్ట్‌ఫోన్ రిలీజ్
Poco X2: రియల్‌మీకి షాక్... తక్కువ ధరకే 'పోకో ఎక్స్2' స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (image: Poco India)
  • Share this:
పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్2 వచ్చేసింది. పోకో ఎఫ్1... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన ఫ్లాగ్‌షిప్ మోడల్. షావోమీ నుంచి పోకో ఎఫ్1 వచ్చి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ ఈ ఫోన్‌కు మంచి రివ్యూస్ ఉన్నాయి. అందుకే పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ మోడల్ పోకో ఎఫ్2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు పోకో ఫ్యాన్స్. పోకో ఎఫ్2 పేరుతో వస్తుందనుకున్న ఫోన్ పోకో ఎక్స్2 పేరుతో ఇండియాలో రిలీజైంది. మూడు వేరియంట్లలో పోకో ఎక్స్‌2 మోడల్‌ను పరిచయం చేసింది పోకో ఇండియా. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, VoWifi సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.15,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్, ఈఎంఐ ద్వారా కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఫిబ్రవరి 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎక్స్‌2 అందుబాటులో ఉంటుంది.


పోకో ఎక్స్2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ
రియర్ కెమెరా: 64+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ
ధర:
6జీబీ+64జీబీ- రూ.15,999
6జీబీ+128జీబీ- రూ.16,999
8జీబీ+256జీబీ- రూ.19,999

ఇవి కూడా చదవండి:

Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్

Download Aadhaar: ఈ స్టెప్స్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు

Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబుల్ వడ్డీ
Published by: Santhosh Kumar S
First published: February 4, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading