పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే' తీసుకొచ్చిన షావోమీ

ఐసీఐసీఐ బ్యాంక్, పేయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు షావోమీ వెల్లడించింది. గూగుల్ పే లాగానే మొబైల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా తమ యాప్ గూగుల్ పే కన్నా భిన్నంగా ఉంటుందని చెబుతోంది షావోమీ. ఎంఐ పేలో యూపీఐతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు సపోర్ట్ చేస్తాయంటోంది.

news18-telugu
Updated: December 25, 2018, 6:04 PM IST
పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే' తీసుకొచ్చిన షావోమీ
పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే' తీసుకొచ్చిన షావోమీ
  • Share this:
షావోమీ... స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం. ఇప్పుడు పేమెంట్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఎంఐ పే పేరుతో ఇండియన్ మార్కెట్‌లో యాప్ బీటా వర్షన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే పేటీఎం, గూగుల్ పే లాంటి డిజిటల్ వ్యాలెట్స్, ఇ-పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ట్రూకాలర్, వాట్సప్‌ కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి పోటీగా 'ఎంఐ పే' తీసుకొచ్చింది షావోమీ. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లోకి ఎంఐ పే బీటా వర్షన్ రిలీజ్ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) క్లియరెన్స్ వచ్చిందని చెప్పిన షావోమీ, బీటా టెస్టింగ్ తర్వాత యూజర్లందరికీ యాప్ రిలీజ్ చేయనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్, పేయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు షావోమీ వెల్లడించింది. గూగుల్ పే లాగానే మొబైల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా తమ యాప్ గూగుల్ పే కన్నా భిన్నంగా ఉంటుందని చెబుతోంది షావోమీ. ఎంఐ పేలో యూపీఐతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు సపోర్ట్ చేస్తాయంటోంది. మనీ ట్రాన్స్‌ఫర్ తో పాటు బిల్లులు, రీఛార్జుల చెల్లింపులు చేయొచ్చు. భారత్ క్యూఆర్ కోడ్‌తో సహా ఇతర క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొచ్చు. మీరూ  షావోమీ ఎంఐ పే ఉపయోగించాలంటే ఎంఐయూఐ గ్లోబల్ బీటా రోమ్ వాడుతూ ఉండాలి. డిసెంబర్ 31 లోగా ఎంఐ పే బీటా టెస్టింగ్‌లో సైనప్ చేయొచ్చు.


ఇవి కూడా చదవండి:

#FlashBack2018: ఈ ఏడాది టాప్-10 ఇవే... మీరెన్ని ఆడారు?

ALERT: త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ మారనుంది తెలుసా?

క్రెడిట్ కార్డ్ లిమిట్ మరీ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే రిస్కేఎస్‌బీఐ కార్డులు మార్చుకోవడానికి వారమే గడువు... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
Published by: Santhosh Kumar S
First published: December 24, 2018, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading