Xiaomi Offer: ఎంఐ ఏ2, రెడ్‌మీ నోట్ 6 ప్రో ధర రూ.11,999 మాత్రమే

Xiaomi Smartphone Offer | రెడ్‌మీ నోట్ 6 ప్రోతో పాటు ఎంఐ ఏ2 మోడల్ ధర కూడా తగ్గించింది షావోమీ. ఆండ్రాయిడ్ వన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఈ ఫోన్ ప్రత్యేకత.

news18-telugu
Updated: April 1, 2019, 1:15 PM IST
Xiaomi Offer: ఎంఐ ఏ2, రెడ్‌మీ నోట్ 6 ప్రో ధర రూ.11,999 మాత్రమే
Xiaomi Offer: ఎంఐ ఏ2, రెడ్‌మీ నోట్ 6 ప్రో ధర రూ.11,999 మాత్రమే
  • Share this:
షావోమీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తోంది ఆ కంపెనీ. ఇటీవల రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్ రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు పాత స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గిస్తోంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసింది కాబట్టి ఇప్పుడు రెడ్‌మీ నోట్ 6 ప్రో ధరను భారీగా తగ్గించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 5 ప్రో తర్వాత రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్‌కు ముందే రెడ్‌మీ నోట్ 6 ప్రో తగ్గించింది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, నాచ్ డిస్‌ప్లే, నాలుగు కెమెరాలు రెడ్‌మీ నోట్ 6 ప్రో ప్రత్యేకత.


రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.24 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 1080×2280 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 9.6
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్
ధర:
4జీబీ+64జీబీ- రూ.11,999

షావోమీ ఎంఐ ఏ2


రెడ్‌మీ నోట్ 6 ప్రోతో పాటు ఎంఐ ఏ2 మోడల్ ధర కూడా తగ్గించింది షావోమీ. ఆండ్రాయిడ్ వన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఈ ఫోన్ ప్రత్యేకత. కెమెరా విషయానికొస్తే ఎంఐ ఏ2 ఫ్రంట్ కెమెరా 12+20 మెగాపిక్సెల్‌, ఎల్ఈడీ ఫ్లాష్‌ ఏఐ సపోర్ట్‌తో పనిచేస్తాయి. ఫ్రంట్‌లో 20 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీలైట్‌తో వస్తుంది. యూఎస్‌బీ టైప్-సీ, 2.5డీ గొరిల్లా గ్లాస్ 5 లాంటి ఫీచర్లున్నాయి.


షావోమీ ఎంఐ ఏ2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల నాచ్ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3జీబీ, 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 12+20 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,010 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ వన్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ నానో
కలర్స్: గోల్డ్, లేక్ బ్లూ, బ్లాక్
ధర:
4 జీబీ+64 జీబీ- రూ.11,999

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Realme 3 Sale: రేపే రియల్‌మీ 3 సేల్... ధర రూ.8,999... జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్

Voter Helpline App: ఓటర్ హెల్ప్‌లైన్ యాప్... ఎలా వాడాలో తెలుసుకోండి

Facebook Bug:  మీ ఫేస్‌బుక్‌ ఛాటింగ్‌ను లీక్ చేసే బగ్

SBI Minor Account: ఎస్‌బీఐలో పిల్లల కోసం రెండు అకౌంట్లు... లాభాలు ఇవే
First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు