Home /News /technology /

XIAOMI SMART TV 5A PRO 32 INCH SMART TV LAUNCHED IN INDIA WITH OFFER PRICE RS 15499 KNOW SPECIFICATIONS SS

Xiaomi Smart TV 5A Pro: డాల్బీ ఆడియో, 24వాట్ స్పీకర్స్, సరికొత్త ప్రాసెసర్... షావోమీ నుంచి కొత్త స్మార్ట్ టీవీ

Xiaomi Smart TV 5A Pro: డాల్బీ ఆడియో, 24వాట్ స్పీకర్స్, సరికొత్త ప్రాసెసర్... షావోమీ నుంచి కొత్త స్మార్ట్ టీవీ
(image: Xiaomi India)

Xiaomi Smart TV 5A Pro: డాల్బీ ఆడియో, 24వాట్ స్పీకర్స్, సరికొత్త ప్రాసెసర్... షావోమీ నుంచి కొత్త స్మార్ట్ టీవీ (image: Xiaomi India)

Xiaomi Smart TV 5A Pro | షావోమీ ఇండియా 32 అంగుళాల స్మార్ట్ టీవీని (Smart TV) లాంఛ్ చేసింది. డాల్బీ ఆడియో, 24వాట్ స్పీకర్స్, సరికొత్త ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
షావోమీ ఇండియా భారతదేశంలో మరో స్మార్ట్ టీవీని లాంఛ్ చేసింది. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో (Xiaomi Smart TV 5A Pro) మోడల్‌ను పరిచయం చేసింది. ఇది 32 అంగుళాల స్మార్ట్ టీవీ. ఇందులో డాల్బీ ఆడియో, 24వాట్ స్పీకర్స్, సరికొత్త ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ (Smart TV) ధర రూ.16,999. ఈ స్మార్ట్ టీవీని షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంఐ హోమ్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనొచ్చు. లోకల్ రీటైలర్ దగ్గర ఈ స్మార్ట్ టీవీ కొనాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో మోడల్‌ను రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. సేల్ త్వరలో ప్రారంభం కానుంది.

షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో ఫీచర్స్


షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఎంట్రీ లెవెల్ మోడల్. ఇప్పటివరకు సాధారణ ఎల్ఈడీ టీవీ ఉపయోగించినవారు స్మార్ట్ టీవీ ట్రై చేయాలనుకుంటే ఈ మోడల్ తీసుకోవచ్చు. ఇందులో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్క్రీన్ ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది. ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ ఫ్రేమ్ ఉంటుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. చిన్నగదిలో స్మార్ట్ టీవీ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. ఫైన్ ట్యూనింగ్ కలర్స్ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఉంది.

WhatsApp Profile Pic: వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌లో మరో కొత్త ఫీచర్


షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో 32 అంగుళాల మోడల్‌లో 24వాట్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఆడియో, DTS:X, DTS Virtual:X టెక్నాలజీస్ సపోర్ట్ ఉంది. క్వాడ్ కోర్ కార్టెక్స్ ఏ55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కార్టెక్స్ ఏ35 ప్రాసెసర్‌కు అప్‌గ్రేడ్ ప్రాసెసర్ ఇది. ఇందులో 1.5జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Moto G32: కాసేపట్లో మోటో జీ32 సేల్... రూ.12,000 లోపే 90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా



షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో ఆండ్రాయిడ్ టీవీ 11 బేస్డ్ ప్యాచ్‌వాల్ ఆఫరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్‌గా లభిస్తుంది. 30 పైగా భారతీయ భాషలు, ఇంటర్నేషనల్ కంటెంట్ పార్ట్‌నర్స్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. 300 పైగా లైవ్ ఛానెల్స్ చూడొచ్చు. పేరెంటెల్ లాక్‌తో కిడ్స్ మోడ్ ఉంటుంది. రిమోట్‌లో క్విక్ మ్యూట్, క్విక్ వేక్, క్విక్ సెట్టింగ్స్ లాంటి బటన్స్ కూడా ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ సాయంతో ఆపరేట్ చేయొచ్చు. 15పైగా భాషలతో ఆపరేట్ చేయొచ్చు. ఇందులో 2 హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 ఎథర్నెట్ పోర్ట్, 3.5ఎంఎం జాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Android TV, Smart TV

తదుపరి వార్తలు