స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో ఇది మరో సంచలనం. ఓ మోడల్ స్మార్ట్‌ఫోన్లు కేవలం 5 నిమిషాల్లో 3,50,000 యూనిట్లు అమ్ముడు పోవడం విశేషం. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో ఇదే చర్చ. షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11 సృష్టించిన రికార్డ్ ఇది. ఫస్ట్ సేల్‌లో ఐదు నిమిషాల్లో 3,50,000 స్మార్ట్‌ఫోన్లు అమ్మేశామని షావోమీ వైస్ ప్రెసిడెంట్ Zeng Xuezhong ప్రకటించారు. షావోమీ ఎంఐ 11 స్మార్ట్‌ఫోన్ కొద్ది రోజుల క్రితం చైనాలో రిలీజైంది. చైనాలో సరిగ్గా న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టిన సమయంలో సేల్ మొదలైంది. అంతే... ఈ స్మార్ట్‌ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొదటి ఐదు నిమిషాల్లో 3,50,000 స్మార్ట్‌ఫోన్లు బుక్ అయిపోయాయి. వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను అమ్మితే మొదటి ఏడు గంటల్లో 8,54,000 యూనిట్స్ అమ్ముడుపోవడం మరో విశేషం. అంటే ఏడుగంటల్లోనే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11 సేల్స్ రూ.1,677 కోట్లు జరగడం విశేషం.
ఇక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11 ప్రత్యేకతలు చూస్తే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. 8కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. 6.81 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4,600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 55వాట్ వైర్డ్ ఛార్డింగ్, 50వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
UPI Transaction: గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్
WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్‌తో మీ వాట్సప్ సేఫ్... వెంటనే మార్చేయండి
ఈ స్మార్ట్‌ఫోన్ బాక్సులో ఛార్జర్ ఉండదు. ఛార్జర్‌తో పాటు ఈ ఫోన్ కొనొచ్చు. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే అప్పటికే తమ దగ్గర ఛార్జర్ ఉన్నవాళ్లు బాక్సులో ఛార్జర్ లేని స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆప్షన్ ఇస్తోంది షావోమీ. ఇక ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే రిలీజ్ అయింది. ఇతర దేశాల్లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా షావోమీ ప్రకటించలేదు.
Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్
IRCTC: రైల్వే ప్రయాణికులకు న్యూ ఇయర్ గిఫ్ట్... ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్స్
షావోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.81 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
రియర్ కెమెరా: 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ టెలీఫోటో మ్యాక్రో సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,600ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఖాకీ, స్మోక్ పర్పుల్, బ్లాక్, వైట్, బ్లూ
ధర:
8జీబీ+128జీబీ- సుమారు రూ.45,000
8జీబీ+256జీబీ- సుమారు రూ.48,000
12జీబీ+256జీబీ- సుమారు రూ.52,500
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Xiaomi