హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart TV: ఈ స్మార్ట్‌ టీవీలకు జనాల్లో ఫుల్ క్రేజ్.. తెగ కొనేస్తున్నారు!

Smart TV: ఈ స్మార్ట్‌ టీవీలకు జనాల్లో ఫుల్ క్రేజ్.. తెగ కొనేస్తున్నారు!

 Smart TV: ఈ స్మార్ట్‌ టీవీలకు జనాల్లో ఫుల్ క్రేజ్.. తెగ కొనేస్తున్నారు!

Smart TV: ఈ స్మార్ట్‌ టీవీలకు జనాల్లో ఫుల్ క్రేజ్.. తెగ కొనేస్తున్నారు!

Xiaomi Smart TV | మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే జనాలు ఎక్కువగా ఏ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తున్నారో తెలుసుకోండి. టాప్ 3 బ్రాండ్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Samsung Smart TV | కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఏ స్మార్ట్ టీవీ (Smart TV) కొనుగోలు చేయాలో తెలియడం లేదా? ప్రజలు ఎక్కువగా ఏ టీవీ (TV) కొంటున్నారో తెలుసుకుంటే.. మీరు ఏ టీవీ కొనాలో ఒక అంచనాకు రావొచ్చు. మార్కెట్‌లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో ఏ ఏ కంపెనీ టీవీలకు అధిక డిమాండ్ ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం చూస్తే.. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ టీవీ మార్కెట్ వాటా వార్షికంగా 38 శాతం మేర పెరిగింది. పండుగ సీజన్, కొత్త కొత్త ఆవిష్కరణలు, డిస్కౌంట్ ఆఫర్లు, ప్రమోషన్స్ వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో గ్లోబల్ కంపెనీలకు చెందిన బ్రాండ్లు హవా కొనసాగిస్తున్నాయి. వీటి మార్కెట్ వాటా 40 శాతం దాకా ఉంది. చైనా బ్రాండ్లు 38 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇండియన్ బ్రాండ్లు కూడా పోటీ పడుతున్నాయి. మార్కెట్ వాటాను పెంచుకుంటన్నాయి. వీటి మార్కెట్ వాటా 22 శాతంగా ఉంది. రెట్టింపు అయ్యింది.

రూ.50 వేల డిస్కౌంట్.. కారు కొనే వారికి బంపరాఫర్

జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 32 అంగుళాలు, 42 అంగుళాల స్మార్ట్ టీవీలకు అధిక డిమాండ్ కనిపించింది. మొత్తం అమ్మకాల్లో ఇవి 50 శాతం వాటాను ఆక్రమించాయి. కస్టమర్లు చాలా వరకు డిస్‌ప్లే ప్రామాణికంగా టీవీలను కొనుగోలు చేస్తున్నారు. ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ టీవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. డాల్బే ఆడియో, బెటర్ స్పీకర్లు వంటి ఫీచర్లను కూడా జనాలు గమనిస్తున్నారు.

శాంసంగ్ అదిరే శుభవార్త.. ఇక వీటిపై 20 ఏళ్ల వరకు వారంటీ!

టీవీ అమ్మకాల్లో ఆన్‌లైన్ విభాగం వాటా పెరుగుతూ వస్తోంది. దాదాపు 35 శాతానికి చేరింది. రానున్న రోజుల్లో కంపెనీలు చాలా వరకు రూ. 20 వేల ధరలోపు టీవీలను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. దీంతో ఈ వాటా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. స్మార్ట్ టీవీ మార్కెట్‌లో షావోమి టాప్‌లో కొనసాగుతోంది. ఇది 11 శాతం వాటాను ఆక్రమించింది. అలాగే శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 10 శాతంగా ఉంది. ఇక ఎల్‌జీ 9 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. వన్‌ప్లస్ టీవీ అమ్మకాలు బాగా పెరిగాయి. ఇది 8.5 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉంది. వన్‌ప్లస్, వీయూ, టీసీఎల్ బ్రాండ్ టీవీ అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. రియల్‌మి, హయర్ బ్రాండ్లు కూడా టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకున్నాయి.

First published:

Tags: Android TV, Budget smart tv, Samsung, Smart TV, Smart tvs, Xiaomi

ఉత్తమ కథలు