Redmi K20: రేపే రెడ్‌మీ కే20 రిలీజ్... ప్రత్యేకతలివే

Redmi K20 launch in China | రెడ్‌మీ కే20 స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, పాప్ అప్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.

news18-telugu
Updated: May 27, 2019, 5:32 PM IST
Redmi K20: రేపే రెడ్‌మీ కే20 రిలీజ్... ప్రత్యేకతలివే
Redmi K20: రేపే రెడ్‌మీ కే20 రిలీజ్... ప్రత్యేకతలివే (image: @manukumarjain/twitter)
news18-telugu
Updated: May 27, 2019, 5:32 PM IST
షావోమీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ కే20 మే 28న రిలీజ్ కానుంది. ఈ ఫోన్‌ను ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0 పేరుతో షావోమీ ప్రచారం చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇది. వన్‌ప్లస్ 7 సిరీస్‌కు పోటీగా రెడ్‌మీ కే20 స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది రోజుల క్రితం ప్రకటించింది షావోమీ. మే 28న చైనాలో రెడ్‌మీ కే20 రిలీజ్ కాబోతోంది. రెడ్‌మీ కే20తో పాటు రెడ్‌మీ కే20 ప్రో మోడల్ కూడా రిలీజ్ చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెడ్‌మీ కే20 వచ్చే నెలలో ఇండియాలో రిలీజ్ కానుందని అంచనా. పోకో ఎఫ్2 స్థానంలో రెడ్‌మీ కే20 ప్రో తీసుకురావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెడ్‌మీ కే20 స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, పాప్ అప్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.

Loading...
రెడ్‌మీ కే20 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్‌ప్లే: 6.9 అంగుళాల అమొలెడ్
ర్యామ్: 6జీబీ, 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+16+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
కలర్స్: కార్బన్ ఫైబర్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్

Asus Zenfone 6: త్వరలో ఇండియాకి ఏసుస్ జెన్‌ఫోన్ 6


ఇవి కూడా చదవండి:

Black Shark 2: గేమింగ్ లవర్స్‌ కోసం స్పెషల్ ఫోన్ బ్లాక్ షార్క్ 2

Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...