Redmi: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీకు గుడ్ న్యూస్

Redmi smartphones | దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫీచర్ అన్ని ఫోన్లల్లో అందుబాటులో లేదు. కొన్ని ఫోన్లకు మాత్రమే ఈ సర్వీస్ పరిమితం.

news18-telugu
Updated: January 17, 2020, 4:41 PM IST
Redmi: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీకు గుడ్ న్యూస్
Redmi: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీకు గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? రెడ్‌మీ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కొన్ని ఫోన్లకు అద్భుతమైన ఫీచర్ రిలీజ్ చేసింది షావోమీ. ఇటీవల రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫీచర్ అన్ని ఫోన్లల్లో అందుబాటులో లేదు. కొన్ని ఫోన్లకు మాత్రమే ఈ సర్వీస్ పరిమితం. అయితే కొన్నిరోజుల వరకు షావోమీకి చెందిన రెండు, మూడు ఫోన్లల్లో మాత్రమే వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. ఇప్పుడు ఏకంగా ఏడు స్మార్ట్‌ఫోన్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేసింది షావోమీ. రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో, రెడ్‌మీ వై3, రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 8 ప్రో, రెడ్‌మీ 7, రెడ్‌మీ 7ఏ స్మార్ట్‌ఫోన్లకు VoWiFi ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమీ. వీటిలో రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కేవలం జియో వైఫై కాలింగ్ మాత్రమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని షావోమీ ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించింది.

షావోమీ వైఫై కాలింగ్ అందిస్తున్న ఏడు స్మార్ట్‌ఫోన్లల్లో మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే మీరు వైఫై ద్వారా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. వైఫై కాలింగ్ ఫీచర్ వాడుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. మీరు వాడే రెడ్‌మీ ఫోన్లల్లో Settings ఓపెన్ చేసి VoWiFi ఫీచర్ ఆన్ చేయాలి.

స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్‌మీ ఎక్స్2 ప్రో అద్భుతం



ఇవి కూడా చదవండి:

Realme: రియల్‌మీ ఫోన్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్

Gold: మార్కెట్ రేట్ కన్నా రూ.1,800 తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా

Jobs: ఈ ఏడాది ఈ 10 ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్
First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు