Redmi Note 9S: రెడ్‌మీ నోట్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ప్రత్యేకతలివే

Redmi Note 9S | షావోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయమైంది. రెడ్‌మీ నోట్ 9ఎస్ ఎలా ఉందో చూడండి.

news18-telugu
Updated: March 25, 2020, 10:31 AM IST
Redmi Note 9S: రెడ్‌మీ నోట్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ప్రత్యేకతలివే
Redmi Note 9S: రెడ్‌మీ నోట్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ప్రత్యేకతలివే
  • Share this:
రెడ్‌మీ నోట్ 9 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది షావోమీ. ఇండియాలో ఇప్పటికే రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ మలేషియాలో రిలీజైంది. ఈ ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్, 5020ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సింగపూర్, థాయ్‌ల్యాండ్, మలేషియాలో ఏప్రిల్7 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అయితే ఇండియాలో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 9 ప్రో ఫీచర్స్ లాగానే రెడ్‌మీ నోట్ 9ఎస్ స్పెసిఫికషన్స్ ఉన్నాయి. మరి ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో తెలియదు.

రెడ్‌మీ నోట్ 9ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+

ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 720జీ
రియర్ కెమెరా: 48+8+5+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5020ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఇంటర్‌స్టెల్లార్ గ్రే, అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్
ధర:
4జీబీ+64జీబీ- రూ.13,800
6జీబీ+128జీబీ- రూ.15,500

ఇవి కూడా చదవండి:

SBI: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయాలా? ఈ ఫీచర్ ట్రై చేయండి

సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

IRCTC: రైలు టికెట్ల క్యాన్సలేషన్‌పై డౌట్స్... క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు