Redmi Note 8T: షావోమీ నుంచి మరో సర్‌ప్రైజ్... రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్

Xiaomi Redmi Note 8T | స్నాప్‌డ్రాగన్ 665 ఏఐఈ చిప్‌సెట్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, క్వాడ్ కెమెరా సెటప్, 18 W క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: November 7, 2019, 6:13 PM IST
Redmi Note 8T: షావోమీ నుంచి మరో సర్‌ప్రైజ్... రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్
Redmi Note 8T: షావోమీ నుంచి మరో సర్‌ప్రైజ్... రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్ (image: Xiaomi)
  • Share this:
షావోమీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. రెడ్‌మీ నోట్ 8టీ స్మార్ట్‌ఫోన్‌‌ను ప్రపంచానికి పరిచయం చేసింది షావోమీ. రెడ్‌మీ 8 సిరీస్‌లో దూకుడు మీద కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తోంది షావోమీ. ఇప్పటికే రెడ్‌మీ 8 ఏ, రెడ్‌మీ 8, రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో మోడల్స్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే సిరీస్‌లో ఐదో స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 8టీ మోడల్‌ని ఆవిష్కరించింది. యూరప్‌లో జరిగిన ఈవెంట్‌లో 'ఆల్-స్టార్' పేరుతో రెడ్‌మీ నోట్ 8టీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది షావోమీ. 3 జీబీ + 32 జీబీ, 4 జీబీ + 64 జీబీ, 4 జీబీ + 128 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 665 ఏఐఈ చిప్‌సెట్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, క్వాడ్ కెమెరా సెటప్, 18 W క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రాన్స్‌లో నవంబర్ 13న సేల్ ప్రారంభం కానుంది. అయితే ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు.

రెడ్‌మీ నోట్ 8టీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665 ఏఐఈ చిప్‌సెట్
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: స్టార్‌స్కేప్ బ్లూ, మూన్‌లైట్ వైట్, మూన్‌షాడో గ్రే
ధర:
3 జీబీ + 32 జీబీ- సుమారు రూ.14,000
4 జీబీ + 64 జీబీ- సుమారు రూ.15,000
4 జీబీ + 128 జీబీ- సుమారు రూ.19,000

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్‌ గ్రూప్‌లో కొత్త ఫీచర్... సెట్టింగ్స్ ఇవే

WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్... సెట్టింగ్స్ ఇవే

Realme X2 Pro: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రియల్‌మీ ఎక్స్2 ప్రో వచ్చేస్తోంది
First published: November 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...