Redmi Note 8 Series: రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.9,999 నుంచి

Redmi Note 8 Series | రెడ్‌మీ నోట్ 8 ప్రోలో 64 మెగాపిక్సెల్ కెమెరా, రెడ్‌మీ నోట్ 8 లో 48 మెగాపిక్సెల్ కెమెరా, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం.

news18-telugu
Updated: October 17, 2019, 1:55 PM IST
Redmi Note 8 Series: రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.9,999 నుంచి
Redmi Note 8 Series: రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.9,999 నుంచి (image: Redmi India)
news18-telugu
Updated: October 17, 2019, 1:55 PM IST
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ... రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇండియాలో రెడ్‌మీ 8 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ 8ఏ, రెడ్‌మీ 8 మోడల్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో మోడల్స్‌ను ఇండియాకు పరిచయం చేసింది. ఇవి రెడ్‌మీ నోట్ 7ఎస్, రెడ్‌మీ నోట్ 7 ప్రో మోడల్స్ అప్‌గ్రేడ్ వర్షన్స్. కొద్ది రోజుల క్రితమే చైనాలో రిలీజైన ఈ ఫోన్లు ఇప్పుడు ఇండియాకు వచ్చాయి. రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 కావడం విశేషం. రెడ్‌మీ నోట్ 8 ప్రో ఏకంగా 6జీబీ+64జీబీ వేరియంట్‌తో లాంఛైంది. ధర రూ.14,999. రెడ్‌మీ నోట్ 8 ప్రోలో 64 మెగాపిక్సెల్ కెమెరా, రెడ్‌మీ నోట్ 8 లో 48 మెగాపిక్సెల్ కెమెరా, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు అమెజాన్, mi.com వెబ్‌సైట్లల్లో అక్టోబర్ 21 నుంచి అందుబాటులో ఉంటాయి.








Loading...




















































రెడ్‌మీ నోట్ 8 ప్రో రెడ్‌మీ నోట్ 8
 డిస్‌ప్లే 6.53 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే డిస్‌ప్లే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
 ర్యామ్ 6జీబీ, 8జీబీ 4జీబీ, 6జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్ 64జీబీ, 128జీబీ 64జీబీ, 128జీబీ
 ప్రాసెసర్ మీడియాటెక్ జీ90టీ స్నాప్‌డ్రాగన్ 665
 రియర్ కెమెరా 64+8+2+2 మెగాపిక్సెల్ 48+8+2+2 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్
 బ్యాటరీ 4,500 ఎంఏహెచ్ 4,000 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9 పై ఆండ్రాయిడ్ 9 పై
 కలర్స్ బ్లాక్, గ్రీన్, వైట్ స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ పర్పుల్, మూన్‌లైట్ వైట్
ధర 6జీబీ+64జీబీ- రూ.14,999
6జీబీ+128జీబీ- రూ.15,999
8జీబీ+128జీబీ- రూ.17,999
4జీబీ+64జీబీ- రూ.9,999
6జీబీ+128జీబీ- రూ.12,999

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Realme X2 Pro: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ ఎక్స్2 ప్రో రిలీజ్... ప్రత్యేకతలివే

Smartphone: రూ.15,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇవే బెస్ట్ మోడల్స్

SBI Alerts: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తున్నాయా? రాకపోతే ఇలా రిజిస్టర్ చేసుకోండి
First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...