Home /News /technology /

XIAOMI RELEASED REDMI NOTE 7 PRO IN INDIA KNOW SPECIFICATIONS FEATURES PRICE DETAILS SS

Redmi Note 7 Pro: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్

Redmi Note 7 Pro (image: @RedmiIndia/twitter)

Redmi Note 7 Pro (image: @RedmiIndia/twitter)

Xiaomi Redmi Note 7 Pro | ఎట్టకేలకు షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసింది షావోమీ. ఈ ఫోన్‌ను ఇండియాలోనే మొదటిసారిగా రిలీజ్ చేయడం విశేషం.

    షావోమీ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద గుడ్ న్యూస్. ఇండియాలో రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసింది షావోమీ. గతేడాది రెడ్‌మీ 6 సిరీస్ తీసుకొచ్చిన షావోమీ... యూజర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌‌తో పోలిస్తే రెడ్‌మీ నోట్ 6 ప్రో అప్‌గ్రేడ్ బాగాలేదన్న అభిప్రాయం షావోమీ ఫ్యాన్స్‌లో ఉంది. దీంతో రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేయాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేయాలంటూ షావోమీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంపెనీని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసింది షావోమీ. ఈ ఫోన్‌ను ఇండియాలోనే మొదటిసారిగా రిలీజ్ చేయడం విశేషం. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. రెడ్‌మీ నోట్ 5 ప్రో, నోట్ 6 ప్రో కన్నా రెడ్‌మీ నోట్ 7 ప్రో డిస్‌ప్లే కాస్త పెద్దగా ఉంటుంది.

    Read this: Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?

    రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
    ర్యామ్: 4జీబీ, 6 జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా
    బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
    కలర్స్: నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.13,999
    6జీబీ+128జీబీ- రూ.16,999

    Redmi Note 7 Pro, redmi note 7 pro release date, redmi note 7 pro launch date, redmi note 7 pro specifications, redmi note 7 pro features, redmi note 7 pro india launching, redmi note 7 pro price, 48mp camera, Technology News, టెక్నాలజీ న్యూస్, షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఆఫర్, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో
    రెడ్‌మీ నోట్ 7


    రెడ్‌మీ నోట్ 7 ప్రోతో పాటు రెడ్‌మీ నోట్ 7 కూడా లాంఛ్ చేసింది షావోమీ. రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్ ఇవే.
    డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
    ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64 జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
    రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
    కలర్స్: రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్
    ధర:
    3జీబీ+32జీబీ- రూ.9,999
    4జీబీ+64జీబీ- రూ.11,999

    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

    Personal Finance: అకౌంట్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే 'ఆటో స్వీప్' గురించి మీకు తెలుసా?
    First published:

    Tags: Android, Redmi, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు