Redmi-Jio offer: రెడ్‌మీ నోట్ 7 ప్రో కొత్త వేరియంట్ రిలీజ్... రిలయెన్స్ జియో నుంచి ఆఫర్స్

Redmi-Jio offer | రెడ్‌మీ నోట్ 7 ప్రో కొన్నవారికి జియో నుంచి డబుల్ డేటా ఆఫర్ లభిస్తుంది. రూ.198 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్నవారికి ఆఫర్ వర్తిస్తుంది.

news18-telugu
Updated: July 4, 2019, 10:22 AM IST
Redmi-Jio offer: రెడ్‌మీ నోట్ 7 ప్రో కొత్త వేరియంట్ రిలీజ్... రిలయెన్స్ జియో నుంచి ఆఫర్స్
Redmi-Jio offer: రెడ్‌మీ నోట్ 7 ప్రో కొత్త వేరియంట్ రిలీజ్... రిలయెన్స్ జియో నుంచి ఆఫర్స్ (image: Xiaomi)
news18-telugu
Updated: July 4, 2019, 10:22 AM IST
రెడ్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్ రిలీజైంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫిబ్రవరిలో లాంఛైంది. ప్రస్తుతం బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇది. లాంఛ్ చేసిన నెలలోనే 10 లక్షల యూనిట్స్ అమ్మింది షావోమీ. ప్రస్తుతం 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే 6జీబీ+64జీబీ వేరియంట్ కావాలని షావోమీ ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ ఉన్నాయి. మొత్తానికి రెడ్‌మీ నోట్ 7 ప్రో మూడో వేరియంట్ రిలీజైంది. జూలై 4 మధ్యాహ్నం 12 గంటలకు Mi.com, ఎంఐ హోమ్ స్టోర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలుకానుంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లో డాట్ నాచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఫేస్ అన్‌లాక్, టైప్ సీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో కొన్నవారికి జియో నుంచి డబుల్ డేటా ఆఫర్ లభిస్తుంది. రూ.198 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్నవారికి ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ కస్టమర్లకు 'ఎయిర్‌టెల్ థ్యాంక్స్' బెనిఫిట్స్ లభిస్తాయి.

రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్
ధర:
6జీబీ+64జీబీ- రూ.15,999

షావోమీ మొదట రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 7 ప్రో 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఇవే ఫీచర్లు ఉంటాయి. 4జీబీ+64జీబీ ధర రూ.13,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.16,999.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990

Samsung: రెడ్‌మీ 7ఏ ఎఫెక్ట్... రూ.1,000 తగ్గిన సాంసంగ్ గెలాక్సీ ఎం10

Realme X: బీ రెడీ... 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది
First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...