Home /News /technology /

XIAOMI RELEASED REDMI NOTE 7 FIRST SALE ON MARCH 6TH AT 12 PM KNOW PRICE DETAILS OFFERS SPECIFICATIONS AND FEATURES SS

Redmi Note 7: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 7 మొదటి సేల్... ఆఫర్లు ఇవే

Redmi Note 7: రేపే రెడ్‌మీ నోట్ 7 మొదటి సేల్... ఆఫర్లు ఇవే (Image: Flipkart)

Redmi Note 7: రేపే రెడ్‌మీ నోట్ 7 మొదటి సేల్... ఆఫర్లు ఇవే (Image: Flipkart)

బుధవారం(మార్చి 6) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు Mi.com, ఎంఐ హోమ్‌లో రెడ్‌మీ నోట్ 7 సేల్ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన వారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

    షావోమీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 ప్రో మొదటి సేల్ మార్చి 6 మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానుంది. గతవారం రెడ్‌మీ నోట్ 7 ప్రోతో పాటు రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది షావోమీ. ఈ ఫోన్‌ చైనాలో రిలీజ్ అయినప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు షావోమీ ఫ్యాన్స్. చివరకు ఫిబ్రవరి 28న అధికారికంగా ఇండియాలో రెడ్‌మీ నోట్ 7 మోడల్‌ను షావోమీ లాంఛ్ చేసింది. బుధవారం(మార్చి 6) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు Mi.com, ఎంఐ హోమ్‌లో రెడ్‌మీ నోట్ 7 సేల్ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన వారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. రూ.99తో పాలసీ తీసుకుంటే రూ.6000 బయ్‌బ్యాక్ వ్యాల్యూ లభిస్తుంది. ఇక రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్ మార్చి 13న జరగనుంది.


    రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
    ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64 జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
    రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
    కలర్స్: రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్
    ధర:
    3జీబీ+32జీబీ- రూ.9,999
    4జీబీ+64జీబీ- రూ.11,999

    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Business Loan: 59 నిమిషాల్లో కోటి రూపాయల లోన్... ఆ వెబ్‌సైట్ ఇదే...

    Aadhar Download: ఇ-ఆధార్ డౌన్‌లోడ్... జస్ట్ 6 స్టెప్స్‌తో సాధ్యం

    SBI Rules: ఎస్‌బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఛార్జీల వివరాలు ఇవే...
    First published:

    Tags: Flipkart, Redmi, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు