Redmi 8A Dual: సర్‌ప్రైజ్ ఇచ్చిన షావోమీ... 'రెడ్‌మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Redmi 8A Dual | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.7,000 లోపేనా? రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. రెడ్‌మీ 8ఏ డ్యుయెల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: February 11, 2020, 1:22 PM IST
Redmi 8A Dual: సర్‌ప్రైజ్ ఇచ్చిన షావోమీ... 'రెడ్‌మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్‌ఫోన్ రిలీజ్
Redmi 8A Dual: సర్‌ప్రైజ్ ఇచ్చిన షావోమీ... 'రెడ్‌మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (image: Redmi India)
  • Share this:
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ... ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇండియాలో రెడ్‌మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను షావోమీ రిలీజ్ చేస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే 'రెడ్‌మీ 8ఏ డ్యుయెల్' పేరుతో కొత్త మోడల్ ఆవిష్కరించి షాకిచ్చింది. ఫిబ్రవరి 11న రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అవుతుందని షావోమీ ప్రకటించింది. అందరు రెడ్‌మీ 9 సిరీస్ ఫోన్లు వస్తాయని అనుకున్నారు. టీజర్లు చూసి మొదట రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయొచ్చని అంచనా వేశారు. కానీ... ఊహించని విధంగా సర్‌ప్రైజ్ ఇచ్చింది షావోమీ. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రెడ్‌మీ 8ఏ మోడల్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ 'రెడ్‌మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రెడ్‌మీ ఏ సిరీస్‌లో వచ్చిన మరో మోడల్ ఇది.

'రెడ్‌మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు చూస్తే యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి విశేషాలున్నాయి. 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలో ఏఐ సీన్ డిటెక్షన్, ఏఐ పోర్ట్‌రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌, Mi.com, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో సేల్ మొదలవుతుంది. ఇక 'రెడ్‌మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000ఎంఏహెచ్, 20,000ఎంఏహెచ్ రెడ్‌మీ పవర్ బ్యాంకులను కూడా ఆవిష్కరించింది షావోమీ. 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ధర రూ.799 కాగా, 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ధర రూ.1,599.



రెడ్‌మీ 8ఏ డ్యుయెల్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.22 అంగుళాల హెచ్‌డీ+
ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439

రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: సీ బ్లూ, స్కై వైట్, మిడ్‌నైట్ గ్రే
ధర:
2జీబీ+32జీబీ- రూ.6,499
3జీబీ+32జీబీ- రూ.6,999

ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.20,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Realme PaySa: ఐదు నిమిషాల్లో రూ.1,00,000 వరకు అప్పు... 'రియల్‌మీ పేసా' ఆఫర్

Realme C3: రిలీజైన రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
Published by: Santhosh Kumar S
First published: February 11, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading