Mi Trimmer: షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ

Xiaomi Mi Beard Trimmer | అమెజాన్, ఎంఐ హోమ్స్‌తో పాటు Mi.com వెబ్‌సైట్‌లో జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలవుతుంది.

news18-telugu
Updated: June 25, 2019, 5:59 PM IST
Mi Trimmer: షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ
Mi Trimmer: షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ (Image: Xiaomi India)
  • Share this:
షావోమీ... స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్ బ్యాంక్, ఎంఐ బ్యాండ్ లాంటి యాక్సెసరీస్‌తో ఇండియన్ మార్కెట్‌లో పట్టు సంపాదించుకున్న కంపెనీ. ఇవి మాత్రమే కాదు... ఎల్ఈడీ బల్బ్, ఎయిర్ ప్యూరిఫైర్, సన్‌గ్లాసెస్‌ను కూడా ఇండియాకు తీసుకొచ్చింది కంపెనీ. ఇప్పుడు మరో కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది షావోమీ. కొంతకాలంగా టీజర్లతో ఊరిస్తున్న ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్‌ను ఆవిష్కరించింది. ప్రీ-ఆర్డర్ ఇప్పటికే మొదలైంది. ధర రూ.1,199. అమెజాన్, ఎంఐ హోమ్స్‌తో పాటు Mi.com వెబ్‌సైట్‌లో జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలవుతుంది.


Mi Beard Trimmer: ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ ఫీచర్లివే




ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్‌కు IPX7 సర్టిఫికేషన్ ఉందని చెబుతోంది కంపెనీ. నీళ్లల్లో తడిసినా ట్రిమ్మర్ పాడవదని హామీ ఇస్తోంది. బియర్డ్‌ని స్టైలిష్‌గా మార్చేందుకు 40 లెంత్ సెట్టింగ్స్ ఉన్నాయి. రెండు కోంబ్స్‌ కూడా లభిస్తాయి. 5 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 10 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు. బాక్సులో ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఎంఐ ట్రిమ్మర్‌ను పవర్ బ్యాంక్‌తో కూడా ఛార్జ్ చేయొచ్చు. ట్రావెల్ చేసేవారికి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ బాగుంటుందని కంపెనీ చెబుతోంది.
Loading...
Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

WhatsApp: మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లోకి మార్చేయండి ఇలా...

Realme: రియల్‌మీ నుంచి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... ఫోటో తీస్తే ఇలా ఉంటుంది

48 MP Smartphone: రూ.20,000 లోపు 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్లు ఇవే...
First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...