Redmi K20 Pro: ఇండియాలో రిలీజైన రెడ్‌మీ కే20 ప్రో... అదిరిపోయిన ఫీచర్స్

Redmi K20 Pro | రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఫోన్లల్లో పాప్-అప్ సెల్ఫీ కెమెరా, ఇన్‌-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పనోరమా సెల్ఫీ, డార్క్ మోడ్, అమొలెడ్ డిస్‌ప్లే, 91.9% స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: July 17, 2019, 2:29 PM IST
Redmi K20 Pro: ఇండియాలో రిలీజైన రెడ్‌మీ కే20 ప్రో... అదిరిపోయిన ఫీచర్స్
Redmi K20 Pro: ఇండియాలో రిలీజైన రెడ్‌మీ కే20 ప్రో... అదిరిపోయిన ఫీచర్స్ (image: Redmi)
news18-telugu
Updated: July 17, 2019, 2:29 PM IST
షావోమీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నుంచి కే సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్‌ 7 ప్రో లాంఛ్ అయినప్పటి నుంచి 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0' పేరుతో రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రచారం చేస్తోంది షావోమీ. వన్‌ప్లస్‌ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు రెడ్‌మీ కే20 ప్రో పోటీ ఇస్తుందని చెప్పడంతో షావోమీ ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. రెడ్‌మీ కే20 ప్రో, రెడ్‌మీ కే20 గతంలోనే చైనాలో రిలీజ్ కావడంతో స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. ఈ ఫోన్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు షావోమీ ఫ్యాన్స్. ఇటీవల 'ఆల్ఫా సేల్' పేరుతో స్పెషల్ ప్రీ-బుకింగ్ సేల్ కూడా నిర్వహించింది షావోమీ. మొత్తానికి రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ కే20 మోడల్‌ను కూడా రిలీజ్ చేసింది షావోమీ.

రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఫోన్లల్లో పాప్-అప్ సెల్ఫీ కెమెరా, ఇన్‌-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పనోరమా సెల్ఫీ, డార్క్ మోడ్, అమొలెడ్ డిస్‌ప్లే, 91.9% స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ కే20 ప్రో, రెడ్‌మీ కే20 స్మార్ట్‌ఫోన్లల్లో ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటే, రెడ్‌మీ కే20 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉంది. ఇక రెడ్‌మీ కే20 ప్రో 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, రెడ్‌మీ కే20 మోడల్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ కే20 ప్రో, రెడ్‌మీ కే20 సేల్ జూలై 22న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ కార్డు ఉపయోగించే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్


ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
Loading...
రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ బ్లాక్
ధర:
6జీబీ+128జీబీ- రూ.27,999
8జీబీ+256జీబీ- రూ.30,999

రెడ్‌మీ కే 20 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 730
రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ బ్లాక్
ధర:
6జీబీ+64జీబీ- రూ.21,999
6జీబీ+128జీబీ- రూ.23,999

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...


ఇవి కూడా చదవండి:

Amazon Prime: ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్... పొందండి ఇలా

PAN-Aadhar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా

Railways: అటెన్షన్ ప్లీజ్... ఇక మీ రైలు సమయానికే రానుంది
First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...