Redmi 7A: షావోమీ నుంచి లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ రిలీజ్... ధర రూ.5,799

Redmi 7A | సోనీ ఐఎంఎక్స్ సెన్సార్‌తో రియర్ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ లంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ 7ఏ స్మార్ట్‌ఫోన్ సేల్ జూలై 11న mi.com, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: July 4, 2019, 5:37 PM IST
Redmi 7A: షావోమీ నుంచి లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ రిలీజ్... ధర రూ.5,799
Redmi 7A: షావోమీ నుంచి లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ రిలీజ్... ధర రూ.5,799 (image: Xiaomi)
  • Share this:
తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. షావోమీ నుంచి లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇండియాలో రెడ్‌మీ 7ఏ రిలీజ్ చేసింది షావోమీ. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో రిలీజైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 'రెడ్‌మీ 7' సిరీస్ ఫోన్లు ఇండియాలో వరుసగా లాంఛ్ చేస్తోంది షావోమీ. ఇప్పటికే రెడ్‌మీ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ 7ఎస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. ఇప్పుడు అదే సిరీస్‌లో తక్కువ బడ్జెట్‌లో రెడ్‌మీ 7ఏ తీసుకొచ్చింది. గతంలో షావోమీ రెడ్‌మీ 4ఏ, రెడ్‌మీ 5ఏ, రెడ్‌మీ 6ఏ స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసింది. లో బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు టాప్‌లో నిలిచాయి. ఇప్పుడు మరిన్ని అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రెడ్‌మీ 7ఏ వచ్చేసింది.

ఇటీవల రియల్‌మీ షావోమీకి గట్టి పోటీ ఇస్తోంది. దీంతో మార్కెట్‌లో పట్టు నిలుపుకునేందుకు 'స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్' పేరుతో రెడ్‌మీ 7ఏను షావోమీ పరిచయం చేసింది. సోనీ ఐఎంఎక్స్ సెన్సార్‌తో రియర్ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ 7ఏ స్మార్ట్‌ఫోన్ సేల్ జూలై 11న mi.com, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కొనేవాళ్లకు రెండేళ్ల వారెంటీ లభిస్తుంది. అంతేకాదు... రెడ్‌మీ 7ఏ స్మార్ట్‌ఫోన్‌ను జూలైలో కొనేవాళ్లు రూ.200 తగ్గింపు పొందొచ్చు.



రెడ్‌మీ 7ఏ స్పెసిఫికేషన్స్డిస్‌ప్లే: 5.45 అంగుళాలు, 720 x 1440 పిక్సెల్స్
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్-నానో
కలర్స్: మ్యాట్ బ్లూ, మ్యాట్ బ్లాక్, మ్యాట్ గోల్డ్
ధర:
2జీబీ+16జీబీ- రూ.5,999... జూలైలో కొనేవారికి రూ.200 తగ్గింపు
2జీబీ+32జీబీ- రూ.6,199... జూలైలో కొనేవారికి రూ.200 తగ్గింపు

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Redmi-Jio offer: రెడ్‌మీ నోట్ 7 ప్రో కొత్త వేరియంట్ రిలీజ్... రిలయెన్స్ జియో నుంచి ఆఫర్స్

Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990

Samsung: రెడ్‌మీ 7ఏ ఎఫెక్ట్... రూ.1,000 తగ్గిన సాంసంగ్ గెలాక్సీ ఎం10
First published: July 4, 2019, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading