Redmi 8A: 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ రిలీజ్... ధర రూ.6,499

Redmi 8A | రెడ్‌మీ 7ఏ మోడల్‌కు సరికొత్త మార్పులు చేసి రెడ్‌మీ 8ఏ మోడల్‌ను ఆవిష్కరించింది షావోమీ. 5,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, నాచ్ డిస్‌‌ప్లే లాంటి ఫీచర్లతో తక్కువ ధరకే రెడ్‌మీ 8ఏ అందిస్తుండటం విశేషం.

Santhosh Kumar S | news18-telugu
Updated: September 25, 2019, 2:28 PM IST
Redmi 8A: 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ రిలీజ్... ధర రూ.6,499
Redmi 8A: 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ రిలీజ్... ధర రూ.6,499 (image: Xiaomi India)
Santhosh Kumar S | news18-telugu
Updated: September 25, 2019, 2:28 PM IST
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం కావడానికి ముందే ఇండియన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది షావోమీ. ఇండియాలో తొలిసారిగా రెడ్‌మీ 8 సిరీస్‌ లాంఛ్ చేసింది. రెడ్‌మీ 8 సిరీస్‌‌లో భాగంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 8ఏ వచ్చేసింది. ఇది రెడ్‌మీ 7ఏ అప్‌గ్రేడ్ వర్షన్. రెడ్‌మీ 7ఏ మోడల్‌కు సరికొత్త మార్పులు చేసి రెడ్‌మీ 8ఏ మోడల్‌ను ఆవిష్కరించింది షావోమీ. 5,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, నాచ్ డిస్‌‌ప్లే లాంటి ఫీచర్లతో తక్కువ ధరకే రెడ్‌మీ 8ఏ అందిస్తుండటం విశేషం. 2జీబీ + 32జీబీ, 3జీబీ + 32జీబీ వేరియంట్లలో రెడ్‌మీ 8ఏ లభిస్తుంది. సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు mi.com వెబ్‌సైట్‌లో కొనొచ్చు. త్వరలో ఆఫ్‌లైన్‌ రీటైల్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.
Loading...


రెడ్‌మీ 8ఏ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.22 అంగుళాల హెచ్‌డీ
ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+మెమొరీ కార్డ్ స్లాట్
కలర్స్: మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ బ్లూ, సన్‌సెట్ రెడ్
ధర:
2జీబీ + 32జీబీ- రూ.6,499
3జీబీ + 32జీబీ- రూ.6,999

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఆఫర్ ధరలివే

Realme Offers: ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... కొత్త రేట్లు ఇవే
First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...