• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI RELEASED ANOTHER BUDGET SMARTPHONE REDMI 8 WITH BIG BATTERY FAST CHARGING AND MANY OTHER FEATURES SS

Redmi 8: రెడ్‌మీ 8 రిలీజ్... 4జీబీ+64జీబీ ధర రూ.7,999 మాత్రమే

Redmi 8: రెడ్‌మీ 8 రిలీజ్... 4జీబీ+64జీబీ ధర రూ.7,999 మాత్రమే

Redmi 8: రెడ్‌మీ 8 రిలీజ్... 4జీబీ+64జీబీ ధర రూ.7,999 మాత్రమే (image: Tech2)

Redmi 8 | రెడ్‌మీ 8 స్మార్ట్‌‌ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యుయెల్ కెమెరా, నాచ్ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  • Share this:
    ఒకటి రెండేళ్ల క్రితం 4జీబీ+64జీబీ కెపాసిటీతో ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలన్నా రూ.10,000 కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లు తక్కువ ధరకే వచ్చేస్తున్నాయి. వెంటవెంటనే కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్న కంపెనీలు పోటీపడీ మరీ తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు అందిస్తున్నాయి. అందుకే ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు దిగొస్తున్నాయి. షావోమీ రిలీజ్ చేసిన రెడ్‌ 8 అలాంటి బడ్జెట్ స్మార్ట్‌ఫోనే. కొద్ది రోజుల క్రితం రెడ్‌మీ 8ఏ రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు అదే సిరీస్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌లో రెడ్‌మీ 8 తీసుకొచ్చింది. రెడ్‌మీ 8ఏ కన్నా కాస్త ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ ఇది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యుయెల్ కెమెరా, నాచ్ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999 కాగా 4జీబీ+64జీబీ ధర రూ.8,999. అయితే దీపావళి పండుగ సీజన్ కావడంతో రెడ్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌పై రూ.1,000 డిస్కౌంట్ ప్రకటించింది షావోమీ. అంటే 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.7,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మొదటి 50 లక్షల యూనిట్స్‌కు మాత్రమే. ఆ తర్వాత ధర పెరుగుతుంది. అక్టోబర్ 12 అర్థరాత్రి 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు Mi.com వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది.

    రెడ్‌మీ 8 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 3జీబీ, 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439
    రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
    సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్
    కలర్స్: ఓనిక్స్ బ్లాక్, రూబీ రెడ్, సఫైర్ బ్లూ
    ధర:
    3జీబీ+32జీబీ- రూ.7,999
    4జీబీ+64జీబీ- రూ.8,999 (ఆఫర్ ధర రూ.7,999)

    తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు... లేటెస్ట్ రేట్స్ ఇవే

    Amazon Sale: అమెజాన్‌లో మళ్లీ ఫెస్టివల్ సేల్... ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

    JIO Phone offer: రూ.1500 విలువైన ఫోన్ రూ.699 ధరకే... 2జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌పై కన్నేసిన జియో
    First published:

    అగ్ర కథనాలు