• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI REDMI NOTE 7S XIAOMI RELEASED REDMI NOTE 7S WITH 48 MP DUAL REAR CAMERA KNOW PRICE AND SPECIFICATIONS SS

Redmi Note 7S: రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్ చేసిన షావోమీ... ధర రూ.10,999

Redmi Note 7S: రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్ చేసిన షావోమీ... ధర రూ.10,999

Redmi Note 7S: రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్ చేసిన షావోమీ... ధర రూ.10,999 (image: Flipkart)

Redmi Note 7S | రెడ్‌మీ నోట్ 7 లాగానే రెడ్‌మీ నోట్ 7ఎస్‌లో ఆకట్టుకునే ఫీచర్లున్నాయి. ఫోన్ ముందు, వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉండటం విశేషం. టైప్ సీ పోర్ట్ మరో ప్రత్యేకత.

  • Share this:
    షావోమీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7ఎస్ ఇండియాలో రిలీజైంది. షావోమీ నుంచి వచ్చిన మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే 7 సిరీస్‌లో రెడ్‌మీ 7, రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసిన షావోమీ ఇప్పుడు నాలుగో ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ రిలీజ్ చేస్తున్నట్టు గతవారమే ప్రకటించింది షావోమీ. 48 మెగాపిక్సెల్ కెమెరా, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయని మాత్రమే ప్రకటించిన షావోమీ సస్పెన్స్ మెయింటైన్ చేసింది. రెడ్‌మీ నోట్ 7 లాగానే రెడ్‌మీ నోట్ 7ఎస్‌లో ఆకట్టుకునే ఫీచర్లున్నాయి. ఫోన్ ముందు, వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉండటం విశేషం. టైప్ సీ పోర్ట్ మరో ప్రత్యేకత. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ నోట్ 7ఎస్ సేల్ మే 23న ఫ్లిప్‌కార్ట్‌తో పాటు mi.com, ఎంఐ స్టోర్‌లో కొనొచ్చు.

    రెడ్‌మీ నోట్ 7ఎస్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.3 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
    ర్యామ్: 3జీబీ, 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: ఓనిక్స్ బ్లాక్, సఫైర్ బ్లూ, రూబీ రెడ్
    ధర:
    3జీబీ+32జీబీ- రూ.10,999
    4జీబీ+64జీబీ- రూ.12,999

    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Asus Zenfone 6: త్వరలో ఇండియాకి ఏసుస్ జెన్‌ఫోన్ 6... అదిరిపోయిన ఫీచర్స్ ఇవే

    EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు

    ATM: ఏటీఎంలో ఏఏ సేవలు లభిస్తాయో తెలుసా?
    First published:

    అగ్ర కథనాలు