Home /News /technology /

XIAOMI REDMI NOTE 7 WITH IN DISPLAY FINGERPRINT SENSOR AND 48 MEGAPIXEL CAMERA COMING TO INDIA ON FEBRUARY 28 EVERYTHING YOU NEED TO KNOW SS

Xiaomi Redmi Note 7: ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ కెమెరా... ఆకట్టుకుంటున్న రెడ్‌మీ నోట్ 7

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Xiaomi Redmi Note 7 | ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రమే కాదు 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం రెడ్‌మీ నోట్ 7 మరో ప్రత్యేకత. రియర్, ఫ్రంట్ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి.

    షావోమీ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 రిలీజ్‌కు ఇంకొన్ని రోజులే ఉంది. ఫిబ్రవరి 28న ఈ రెడ్‌మీ నోట్ 7 అధికారికంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే చైనాలో రిలీజైన ఆ ఫోన్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉండటంతో రెడ్‌మీ నోట్ 7 మోడల్‌పై షావోమీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్టు రెడ్‌మీ ఇండియా తన ట్విట్టర్‌లో టీజ్ చేయడం అభిమానులకు పండగే.

    Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు


    ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రమే కాదు 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం రెడ్‌మీ నోట్ 7 మరో ప్రత్యేకత. రియర్, ఫ్రంట్ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో కనిపిచింది.

    రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2340 x 1080 పిక్సెల్స్
    ర్యామ్: 3 జీబీ, 4 జీబీ, 6 జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
    కలర్స్: పింక్, బ్లూ, బ్లాక్
    ధర:
    3జీబీ+32జీబీ- 999 యువాన్లు(సుమారు రూ.10,500)
    4జీబీ+64జీబీ- 1,199 యువాన్లు(సుమారు రూ.12,400)
    6జీబీ+64జీబీ- 1,399 యువాన్లు(సుమారు రూ.14,500)

    Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

    ఇవి కూడా చదవండి:

    Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై

    Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

    Whatsapp Ranking: వాట్సప్‌లో ఆకట్టుకోనున్న మరో కొత్త ఫీచర్ 'ర్యాంకింగ్'
    First published:

    Tags: Android, Redmi, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు