Xiaomi Redmi Note 7: ఫిబ్రవరి 28న లాంఛ్ కానున్న రెడ్‌మీ నోట్ 7

Xiaomi Redmi Note 7 | 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం రెడ్‌మీ నోట్ 7 ప్రత్యేకత. రియర్, ఫ్రంట్ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి.

news18-telugu
Updated: February 15, 2019, 7:09 AM IST
Xiaomi Redmi Note 7: ఫిబ్రవరి 28న లాంఛ్ కానున్న రెడ్‌మీ నోట్ 7
Xiaomi Redmi Note 7: ఫిబ్రవరి 28న లాంఛ్ కానున్న రెడ్‌మీ నోట్ 7
news18-telugu
Updated: February 15, 2019, 7:09 AM IST
షావోమీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్‌కు ముహూర్తం ఖరారైంది. గత నెలలో రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంఛ్ చేసినప్పటి నుంచి ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 28న న్యూ ఢిల్లీలో రెడ్‌మీ నోట్ 7 లాంఛ్ చేస్తున్నట్టు షావోమీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు హాజరవ్వాలనుకుంటే ఎంఐ ఫ్యాన్స్ టికెట్లు కొనుక్కోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 16న ప్రారంభమవుతుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం రెడ్‌మీ నోట్ 7 ప్రత్యేకత. రియర్, ఫ్రంట్ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి.

Loading...
రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2340 x 1080 పిక్సెల్స్
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
కలర్స్: పింక్, బ్లూ, బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- 999 యువాన్లు(సుమారు రూ.10,500)
4జీబీ+64జీబీ- 1,199 యువాన్లు(సుమారు రూ.12,400)
6జీబీ+64జీబీ- 1,399 యువాన్లు(సుమారు రూ.14,500)

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

ఇవి కూడా చదవండి:

Flipkart TV Days: టీవీ కొనాలా? ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్స్ ఇవే...

SBI Card: మీ ఎస్‌బీఐ కార్డు పోయిందా? వెంటనే ఇలా బ్లాక్ చేయొచ్చు

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి
First published: February 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...