REDMI NOTE 7: 48 మెగాపిక్సెల్ భారీ కెమెరా... అదిరిపోయే ఫీచర్లతో షావోమీ రెడ్‌మీ నోట్ 7

REDMI NOTE 7 | ప్రస్తుతం చైనాలో రిలీజైన రెడ్‌మీ నోట్ 7... ఇండియాకు ఎప్పుడు వస్తుందన్న స్పష్టత లేదు. అయితే ఇటీవలే రెడ్‌మీ నోట్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసిన షావోమీ... కాస్త ఆలస్యంగానే రెడ్‌మీ నోట్ 7 తీసుకురావొచ్చు.

news18-telugu
Updated: January 11, 2019, 9:39 AM IST
REDMI NOTE 7: 48 మెగాపిక్సెల్ భారీ కెమెరా... అదిరిపోయే ఫీచర్లతో షావోమీ రెడ్‌మీ నోట్ 7
REDMI NOTE 7: 48 మెగాపిక్సెల్ కెమెరాతో లాంఛైన షావోమీ రెడ్‌మీ నోట్ 7
news18-telugu
Updated: January 11, 2019, 9:39 AM IST
రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ని గ్రాండ్‌గా లాంఛ్ చేసింది షావోమీ. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఇండియాలో రెడ్‌మీ 3, రెడ్‌మీ 4, రెడ్‌మీ 5, రెడ్‌మీ 6 సిరీస్ లాంఛ్ చేసిన షావోమీ... ఇప్పుడు చైనాలో లిటిల్ కింగ్ కాంగ్ పేరుతో రెడ్‌మీ నోట్ 7 రిలీజ్ చేసింది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ, 6జీబీ+64జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోనే అయినా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. రియర్, ఫ్రంట్ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి. ప్రస్తుతం చైనాలో రిలీజైన రెడ్‌మీ నోట్ 7... ఇండియాకు ఎప్పుడు వస్తుందన్న స్పష్టత లేదు. అయితే ఇటీవలే రెడ్‌మీ నోట్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసిన షావోమీ... కాస్త ఆలస్యంగానే రెడ్‌మీ నోట్ 7 తీసుకురావొచ్చు.

రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2340 x 1080 పిక్సెల్స్

ర్యామ్: 3 జీబీ, 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
కలర్స్: పింక్, బ్లూ, బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- 999 యువాన్లు(సుమారు రూ.10,000)
4జీబీ+64జీబీ- 1,199 యువాన్లు(సుమారు రూ.12,000)
6జీబీ+64జీబీ- 1,399 యువాన్లు(సుమారు రూ.14,000)

ఇవి కూడా చదవండి:

పబ్‌జీ గేమ్ ఆడితే పిచ్చెక్కింది... జమ్మూలో ఆస్పత్రిపాలైన ఫిట్‌నెస్ ట్రైనర్

PUBG Mobile: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు చేస్తే నిషేధం తప్పదు

MI LED TV 4X PRO, MI TV 4A PRO: షావోమీ నుంచి మరో రెండు టీవీలు

WhatApp Stickers: వాట్సప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...