నవంబర్ 6... రెడ్‌మీ నోట్ 6 ప్రో లాంఛింగ్...

ఫ్రంట్‌లో రెండు కెమెరాలు రావడం ఒక మార్పు కాగా, నాచ్‍‌ డిస్‌ప్లే మరో అప్‌గ్రేడ్. రెడ్‌మీ నోట్ 6 ప్రో ఎలా ఉంటుందో అన్న ఆసక్తి స్మార్ట్‌ఫోన్ యూజర్లలో కనిపిస్తోంది. అయితే ఈ ఫోన్ ఇప్పటికే ఈ ఫోన్ థాయ్‌ల్యాండ్‌ మార్కెట్‌లో సెప్టెంబర్‌లో రిలీజైంది. కాబట్టి స్పెసిఫికేషన్స్ కొంతవరకు తెలిసినవే. నవంబర్ 6న చైనాలో రిలీజ్ చేసే మోడల్‌తో పాటు ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో లాంఛ్ చేసే మోడల్‌లో ఏమైనా మార్పులు ఉంటాయేమోనని భావిస్తున్నారు.

Santhosh Kumar S | news18-telugu
Updated: November 5, 2018, 12:24 PM IST
నవంబర్ 6... రెడ్‌మీ నోట్ 6 ప్రో లాంఛింగ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మరికొన్ని గంటల్లోనే షావోమీ నుంచి మరో ఫోన్ రిలీజ్ కాబోతోంది. షావోమీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 6 ప్రో లాంఛింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. షావోమీ నుంచి వచ్చిన రెడ్‌మీ నోట్ 5 ప్రో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ ఈ మోడల్ టాప్ సెల్లింగ్ ఫోన్లల్లో ఉండటం విశేషం. ఇప్పుడు దాని అప్‌గ్రేడ్ వర్షన్ అయిన రెడ్‌మీ నోట్ 6 ప్రో మార్కెట్లోకి వచ్చేస్తోంది. నాచ్ డిస్‌ప్లే, నాలుగు కెమెరాలు రెడ్‌మీ నోట్ 6 ప్రో ప్రత్యేకతలు. రెండు రియర్ కెమెరాలు, రెండు ఫ్రంట్ కెమెరాలతో ఫోటోగ్రఫీ లవర్స్‌ని ఆకట్టుకోనుంది రెడ్‌మీ నోట్ 6 ప్రో. ఈ ఫోన్ స్క్రీన్-టు-బాడీ రేషియో 87.6 శాతం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ దాదాపుగా రెడ్‌మీ నోట్ 5 ప్రోలాగే ఉంటాయని అంచనా.

ఫ్రంట్‌లో రెండు కెమెరాలు రావడం ఒక మార్పు కాగా, నాచ్‍‌ డిస్‌ప్లే మరో అప్‌గ్రేడ్. రెడ్‌మీ నోట్ 6 ప్రో ఎలా ఉంటుందో అన్న ఆసక్తి స్మార్ట్‌ఫోన్ యూజర్లలో కనిపిస్తోంది. అయితే ఈ ఫోన్ ఇప్పటికే ఈ ఫోన్ థాయ్‌ల్యాండ్‌ మార్కెట్‌లో సెప్టెంబర్‌లో రిలీజైంది. కాబట్టి స్పెసిఫికేషన్స్ కొంతవరకు తెలిసినవే. నవంబర్ 6న చైనాలో రిలీజ్ చేసే మోడల్‌తో పాటు ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో లాంఛ్ చేసే మోడల్‌లో ఏమైనా మార్పులు ఉంటాయేమోనని భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుస్తాయి.

రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్
రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.26 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 1080×2280 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ, 64 జీబీప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 9.6
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్, రెడ్

ఇవి కూడా చదవండి:

వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

'ఆండ్రాయిడ్ 9 పై' అప్‌డేట్ చేశారా? బ్యాటరీ ఖాళీ అవుతుంది జాగ్రత్త...

ష్యూరిటీ సంతకం పెడుతున్నారా? అయితే జాగ్రత్త...

SBI పర్సనల్ లోన్: నవంబర్ 30 వరకు జీరో  ప్రాసెసింగ్ ఫీజు

Photos: ష్యూరిటీ సంతకం పెడుతున్నారా? అయితే జాగ్రత్త...

Photos: దీపావళి వేడుకలకు సర్వం సిద్ధం... అద్భుతమైన చిత్రమాలిక
Published by: Santhosh Kumar S
First published: November 5, 2018, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading