త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!

నాచ్ డిస్‌ప్లే, నాలుగు కెమెరాలు రెడ్‌మీ నోట్ 6 ప్రో ప్రత్యేకతలు. రెండు రియర్ కెమెరాలు, రెండు ఫ్రంట్ కెమెరాలతో ఫోటోగ్రఫీ లవర్స్‌ని ఆకట్టుకోనుంది రెడ్‌మీ నోట్ 6 ప్రో.

news18-telugu
Updated: October 15, 2018, 1:19 PM IST
త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!
Image: AliExpress
  • Share this:
షావోమీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ థాయ్‌ల్యాండ్ మార్కెట్‌లో సెప్టెంబర్‌లో రిలీజైంది. అక్కడ ధర 6,990 థాయ్ బట్స్. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.15,699. ఈ ఫోన్ మరికొన్ని వారాల్లో ఇండియాలో రిలీజ్ కానుందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి.

నాచ్ డిస్‌ప్లే, నాలుగు కెమెరాలు రెడ్‌మీ నోట్ 6 ప్రో ప్రత్యేకతలు. రెండు రియర్ కెమెరాలు, రెండు ఫ్రంట్ కెమెరాలతో ఫోటోగ్రఫీ లవర్స్‌ని ఆకట్టుకోనుంది రెడ్‌మీ నోట్ 6 ప్రో. ఈ ఫోన్ స్క్రీన్-టు-బాడీ రేషియో 87.6 శాతం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ దాదాపుగా రెడ్‌మీ నోట్ 5 ప్రోలాగే ఉన్నాయి. ఫ్రంట్‌లో రెండు కెమెరాలు రావడం విశేషం. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 5 ప్రో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు కొత్తగా రాబోయే రెడ్‌మీ నోట్ 6 ప్రో ఎలా ఉంటుందో అన్న ఆసక్తి స్మార్ట్‌ఫోన్ యూజర్లలో కనిపిస్తోంది.

రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.24 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 9.6
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్, రెడ్
ధర: సుమారు రూ.15,699

ఇవి కూడా చదవండి:

ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!

నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9

ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
Published by: Santhosh Kumar S
First published: October 15, 2018, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading