రూ.4,000 తగ్గింపుతో రెడ్‌మీ నోట్ 5 ప్రో

రెడ్‌మీ నోట్ 5 ప్రోపై రూ.4,000 తగ్గించినట్టు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. షావోమీ #High5 క్యాంపైన్ పేరుతో భారీ డిస్కౌంట్ ఇచ్చింది. 4జీబీ+64జీబీ మోడల్ ధరను రూ.15,999 నుంచి రూ.12,999, 6జీబీ+64జీబీ ధరను రూ.17,999 నుంచి రూ.13,999 ధరకు తగ్గించింది. మరోవైపు ఎంఐ ఏ2 పైనా రూ.4,500 తగ్గించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 5 సిరీస్‌లో కోటికిపైగా ఫోన్లను అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది.

news18-telugu
Updated: January 8, 2019, 6:50 PM IST
రూ.4,000 తగ్గింపుతో రెడ్‌మీ నోట్ 5 ప్రో
రూ.4,000 తగ్గింపుతో రెడ్‌మీ నోట్ 5 ప్రో (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రెడ్‌మీ నోట్‌ 5 ప్రో... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఫోన్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ రెడ్‌మీ నోట్‌ 6 ప్రో రిలీజైనా సరే... రెడ్‌మీ నోట్‌ 5 ప్రో మోడల్‌కు ఇంకా డిమాండ్ ఉంది. కెమెరాతో పాటు ఇతర అంశాల్లో రెడ్‌మీ నోట్‌ 5 ప్రో పెర్ఫామెన్స్ యూజర్లకు బాగా నచ్చేసింది. ఈ ఫోన్ ధరను భారీగా తగ్గించింది షావోమీ. ఏకంగా రూ.4,000 తగ్గించినట్టు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. షావోమీ #High5 క్యాంపైన్ పేరుతో భారీ డిస్కౌంట్ ఇచ్చింది. 4జీబీ+64జీబీ మోడల్ ధరను రూ.15,999 నుంచి రూ.12,999, 6జీబీ+64జీబీ ధరను రూ.17,999 నుంచి రూ.13,999 ధరకు తగ్గించింది. మరోవైపు ఎంఐ ఏ2 పైనా రూ.4,500 తగ్గించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 5 సిరీస్‌లో కోటికిపైగా ఫోన్లను అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది.

షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2160x1080 పిక్సెల్
ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636, 1.8 గిగాహెర్జ్
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్
కలర్స్: బ్లూ, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్
ధర:
4జీబీ+64జీబీ- రూ.12,999
6జీబీ+64జీబీ- రూ.13,999

ఇవి కూడా చదవండి:
భారీ డిస్కౌంట్: షావోమీ ఎంఐ ఏ2పై రూ.4,500 తగ్గింపు

ఒక్క రూపాయికే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్...

జనవరిలో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

షావోమీ నుంచి మరో గ్యాడ్జెట్... ఎంఐ పవర్ బ్యాంక్ 3 ప్రో
First published: January 8, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading