రెడ్‌మీ నోట్ 5 ప్రో ఓపెన్ సేల్!

రెడ్‌మీ నోట్ 5 ప్రో... మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్న స్మార్ట్‌ఫోన్. ఇన్నాళ్లూ ఫ్లాష్ సేల్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు.

news18-telugu
Updated: August 14, 2018, 1:29 PM IST
రెడ్‌మీ నోట్ 5 ప్రో ఓపెన్ సేల్!
(image: News18.com)
  • Share this:
షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో ఫోన్ కొనడం ఓ సవాల్‌గా ఉండేది. ఫ్లాష్‌ సేల్‌ జరిగే రోజు, సమయం గుర్తుపెట్టుకొని, ఆ సమయానికి లాగిన్ చేసి ఫోన్ కొనడం ఓ పెద్ద టాస్క్‌గా మారేది. ఇకపై ఆ సమస్య లేదు. రెడ్‌మీ నోట్ 5 ప్రో ఫోన్‌ను ఎప్పుడైనా కొనొచ్చు. ఇన్నాళ్లూ ఫ్లాష్ సేల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు ఓపెన్‌ సేల్‌లోకి తీసుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, mi.comలో ఎప్పుడైనా రెడ్‌మీ నోట్ 5 ప్రో కొనొచ్చు. ఇటీవల షావోమీ ప్రకటించిన ఎంఐ ఏ2 స్పెసిఫికేషన్స్ కూడా రెడ్‌మీ నోట్ 5 ప్రోకి దగ్గరగా ఉన్నాయి. స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకున్నవాళ్లే ఎంఐ ఏ2 కొనే అవకాశముంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్‌పై రూ.14,000 తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్, 4.5 టీబీ అదనపు డేటా లభిస్తుంది. ఇటీవలే ఏసుస్ కూడా జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎంఐ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్ మొదలైంది. ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 6జీబీ, హానర్ ప్లే స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5 ప్రో ఫోన్‌కు పోటీ ఇస్తున్నాయి.

షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2160x1080 పిక్సెల్

ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636, 1.8 గిగాహెర్జ్
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్
కలర్స్: బ్లూ, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్
ధర:
4జీబీ+64జీబీ- రూ.14,999
6జీబీ+64జీబీ- రూ.16,999

ఇవి కూడా చదవండి:

గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లు పోతాయ్!
First published: August 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>