రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018 సందర్భంగా రెడ్‌మీ నోట్‌ 5 ప్రో ధరను రూ.2,000 తగ్గించింది షావోమీ. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.12,999 ధరకే లభించడం విశేషం.

news18-telugu
Updated: October 9, 2018, 1:34 PM IST
రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018 సందర్భంగా రెడ్‌మీ నోట్‌ 5 ప్రో ధరను రూ.2,000 తగ్గించింది షావోమీ. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.12,999 ధరకే లభించడం విశేషం.
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మీ నోట్‌ 5 ప్రో మోడల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కారణం... రెడ్‌మీ నోట్‌ 5 ప్రో కెమెరా పనితనమే. ఒకప్పుడు ఫ్లాష్‌సేల్‌లో మాత్రమే లభించే ఈ ఫోన్‌ను ఆ తర్వాత ఓపెన్ సేల్‌లోకి తీసుకొచ్చారు. రెడ్‌మీ నోట్ 5 ప్రో ఫోన్‌ను ఎప్పుడైనా కొనే అవకాశమొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన ఈ ఫోన్‌కు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అయితే త్వరలో షావోమీ కంపెనీ... రెడ్‌మీ నోట్‌ 6 ప్రో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో రెడ్‌మీ నోట్‌ 5 ప్రో ధర తగ్గించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018 సందర్భంగా రెడ్‌మీ నోట్‌ 5 ప్రో ధరను రూ.2,000 తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.12,999 ధరకే లభించడం విశేషం. అంతేకాదు... హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై ఈ ఫోన్ కొంటే మరో 10% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే... మరో రూ.1,300 వరకు తగ్గే అవకాశముంది. రెడ్‌మీ నోట్ 5 ప్రో ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి.షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2160x1080 పిక్సెల్
ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636, 1.8 గిగాహెర్జ్
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్
కలర్స్: బ్లూ, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్
ధర:
4జీబీ+64జీబీ- రూ.12,999

ఇవి కూడా చదవండి:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

హెల్త్ ఇన్సూరెన్స్: ఈ 20 అంశాలు గుర్తుంచుకోండి!
First published: October 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు