హోమ్ /వార్తలు /technology /

Redmi New Mobile: 108 ఎంపీ కెమెరాతో రెడ్​మీ నుంచి కొత్త ఫోన్.. ఫిబ్రవరి 9న భారత మార్కెట్​లోకి.. పూర్తి వివరాలిలా..

Redmi New Mobile: 108 ఎంపీ కెమెరాతో రెడ్​మీ నుంచి కొత్త ఫోన్.. ఫిబ్రవరి 9న భారత మార్కెట్​లోకి.. పూర్తి వివరాలిలా..

షియోమి సబ్​బ్రాండ్ రెడ్​మీ తన నోట్​ 11 సిరీస్​ లైనప్​​ నుంచి త్వరలోనే నోట్​ 11ఎస్​ (Redmi Note 11S) స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్​ లాంచింగ్​కు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  షియోమి సబ్​బ్రాండ్ రెడ్​మీ(Redmi) తన నోట్​ 11 సిరీస్​ లైనప్​​ నుంచి త్వరలోనే నోట్​ 11ఎస్​ (Redmi Note 11S) స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్(Phone)​ లాంచింగ్​కు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు రెడ్​మీ సంస్థ ఈ ఫోన్​ లాంచ్​ డేట్​ను ఫిక్స్​ చేసింది. భారత్​లో ఫిబ్రవరి 11న(February) దీన్ని లాంచ్​ చేయనున్నట్లు సోమవారం ట్విట్టర్(Twitter)​ వేదికగా ప్రకటించింది. అయితే లాంచింగ్​కు సంబంధించిన కచ్చితమైన సమయం, ధర, స్పెసిఫికేషన్ల వివరాలను కంపెనీ ఇంకా ధ్రువీకరించలేదు. కానీ లాంచ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు వచ్చిన టీజర్ పోస్టర్​లో కొన్ని కీలక స్పెసిఫికేషన్లను పేర్కొంది. ఈ టీజర్​ను బట్టి చూస్తే రెడ్​మీ ఫోన్​లో హై ఎండ్ ఫీచర్లు ఉండనున్నాయి.

  IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు

  రెడ్​మీ నోట్11S స్పెసిఫికేషన్లు (అంచనా)..

  రెడ్​మీ నోట్​ 11S గతేడాది నవంబర్‌లో భారత మార్కెట్​లోకి వచ్చిన రెడ్​మీ నోట్​ 11టీ 5జీ స్మార్ట్​ఫోన్​తో సమానమైన స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఫోన్​ను ఇటీవల FCC, BIS అలాగే అనేక ఇతర ఏజెన్సీలకు చెందిన వెబ్‌సైట్లు గుర్తించాయి. ప్రస్తుతం ఇది ఐరోపా, కొన్ని ఆసియా ప్రాంతాల్లో అంతర్గత పరీక్షలో ఉందని ఆయా వెబ్​సైట్లు పేర్కొన్నాయి. ఈ సోర్సెస్ నుంచి ఫోన్‌కి సంబంధించిన కొన్ని కీలక వివరాలు వెలువడ్డాయి.

  సోమవారం రెడ్​మీ విడుదల చేసిన పోస్టర్​ను బట్టి చూస్తే.. రెడ్​మీ నోట్​ 11ఎస్​ కూడా రెడ్​మీ నోట్​ 11 సిరీస్ లాగానే ఫ్లాట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే, వీటి మధ్య గుర్తించిన ఏకైక తేడా ఏమిటంటే రెడ్​మీ నోట్​ 11ఎస్​ వెనుకవైపు కొంచెం ఇరుకైన కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది మొత్తం నాలుగు లెన్స్‌లతో పాటు LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. ఈ మాడ్యూల్‌లో 108- మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 8- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, మాక్రో, బోకె షాట్‌ల కోసం రెండు 2 -మెగాపిక్సెల్ సెన్సార్​ కెమెరాలు ఉండనున్నాయి.

  New Smartphone: వివో V23 Pro నుంచి షియోమి 11T Pro వరకు.. ఈ నెలలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..

  మొత్తం మూడు వేరియంట్లలో..

  రెడ్​మీ నోట్ 11S స్మార్ట్​ఫోన్ మొత్తం​ మూడు మెమరీ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 6 జీబీ ర్యామ్​ + 64 జీబీ స్టోరేజ్​, 6 జీబీ ర్యామ్​ +128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5పై పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్ లాంచింగ్​తో పాటు భారతదేశంలో MIUI 13ని కూడా రెడ్​మీ పరిచయం చేసే అవకాశం ఉంది. గతంలో రెడ్​మీ నోట్​ 11ఎస్​ స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో లీకయ్యాయి.

  లీకేజీలను బట్టి చూస్తే.. ఈ ఫోన్​ 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో G96 చిప్‌సెట్​తో పనిచేస్తుంది. దీనిలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 mAh బ్యాటరీని అందించనుంది. అయితే, రెడ్​మీ సంస్థ మాత్రం వీటిలో దేన్నీ అధికారికంగా ధ్రువీకరించలేదు. లాంచింగ్​ డే సమయంలోనే రెడ్​మీ నోట్​11S ధర, స్పెసిఫికేషన్లపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  First published:

  ఉత్తమ కథలు