• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI REDMI K20 REDMI K20 PRO CAN BE PRE BOOKED FOR RS 855 ON 12 JULY IN ALPHA SALE SS

Redmi K20 Pro: రూ.855 చెల్లించి రెడ్‌మీ కే20 ప్రో బుక్ చేసుకోవచ్చు

Redmi K20 Pro: రూ.855 చెల్లించి రెడ్‌మీ కే20 ప్రో బుక్ చేసుకోవచ్చు

Redmi K20 Pro: రూ.855 చెల్లించి రెడ్‌మీ కే20 ప్రో బుక్ చేసుకోవచ్చు (image: Xiaomi)

Xiaomi Alpha Sale | రూ.855 చెల్లించిన కస్టమర్లకు ఫోన్ రిజర్వ్ చేసి ఉంటుంది. కస్టమర్లకు కూపన్ వస్తుంది. ఆ కూపన్ ఉపయోగించి మొదటి సేల్‌లో రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో సులభంగా కొనుక్కోవచ్చు.

  • Share this:
    షావోమీ ఫ్లాగ్‌షిప్ సిరీస్ రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో జూలై 17న రిలీజ్ కానుంది. ఈ ఫోన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు షావోమీ ఫ్యాన్స్. ఈ ఫోన్స్ రిలీజ్ చేయడానికన్నా ముందే మరో గుడ్ న్యూస్ చెప్పింది షావోమీ. 'ఆల్ఫా సేల్' పేరుతో స్పెషల్ ప్రీ-బుకింగ్ సేల్ నిర్వహించబోతోంది షావోమీ. ఈ ఫోన్ కావాలనుకున్నవాళ్లు ఫ్లిప్‌కార్ట్‌ లేదా Mi.com వెబ్‌సైట్‌లో జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. 'ఆల్ఫా సేల్'లో పాల్గొనే కస్టమర్లు రెడ్‌మీ కే20 లేదా రెడ్‌మీ కే20 ప్రో కోసం ప్రీ బుకింగ్‌లో రూ.855 చెల్లిస్తే చాలు. రూ.855 చెల్లించిన కస్టమర్లకు ఫోన్ రిజర్వ్ చేసి ఉంటుంది. కస్టమర్లకు కూపన్ వస్తుంది. ఆ కూపన్ ఉపయోగించి మొదటి సేల్‌లో రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో సులభంగా కొనుక్కోవచ్చు. ఆర్డర్ సమయంలో మిగతా డబ్బు చెల్లిస్తే చాలు. ఒకవేళ కస్టమర్లు కూపన్ రీడీమ్ చేసుకోకపోతే రిజర్వ్ చేసిన డబ్బు రీఫండ్ అవుతుంది.


    రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో మోడల్స్ షావోమీ నుంచి వస్తున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు. వీటిని చైనాలో కొంతకాలం క్రితమే రిలీజ్ చేసింది షావోమీ. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాప్-అప్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0' షావోమీ ప్రచారం చేస్తున్న ఈ ఫోన్లపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే స్పెసిఫికేషన్స్ తెలియడంతో షావోమీ ఫ్యాన్స్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. మరి జూలై 17న రిలీజ్ కాబోయే రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ధరలు ఎంత ఉంటాయో చూడాలి.

    రెడ్‌మీ కే 20 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 730
    రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్
    ధర:
    6జీబీ+64జీబీ- సుమారు రూ.20,000
    6జీబీ+128జీబీ- సుమారు రూ.21,000

    Xiaomi Alpha Sale, Redmi K20 pro india Release date, Redmi K20 Pro pre booking, Redmi K20 Pro features, Xiaomi, Flipkart, రెడ్‌మీ కే 20 ప్రో రిలీజ్, రెడ్‌మీ కే 20 ప్రో ప్రీ బుకింగ్, రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ కే 20 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ కే 20 ప్రో ధర, షావోమీ ఆల్ఫా సేల్
    image: Xiaomi


    రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.35 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
    రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ ఫైబర్ బ్లాక్
    ధర:
    6జీబీ+64జీబీ- సుమారు రూ.25,000
    6జీబీ+128జీబీ- సుమారు రూ.26,000
    8జీబీ+128జీబీ- సుమారు రూ.28,000
    8జీబీ+256జీబీ- సుమారు రూ.30,000

    Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


    ఇవి కూడా చదవండి:

    Paytm: ఇక పేటీఎం నుంచి స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్స్

    Realme 3i: గుడ్ న్యూస్... జూలై 15న రియల్‌మీ 3ఐ రిలీజ్

    UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి
    First published: