Good News: సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు

Samsung Galaxy M10 Price Cut | రెడ్‌మీ 7ఏ రిలీజ్ ఎఫెక్ట్‌తో గెలాక్సీ ఎం10 ధరను తగ్గించింది సాంసంగ్. కొంతకాలం క్రితం సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: July 3, 2019, 1:57 PM IST
Good News: సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు
Good News: సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు
  • Share this:
స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా లో బడ్జెట్ సెగ్మెంట్‌లో పట్టుకోసం స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. లో బడ్జెట్ సెగ్మెంట్‌ని టార్గెట్ చేస్తూ రెడ్‌మీ 7 ఏ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 4న రిలీజ్ చేయనుంది షావోమీ. దీంతో ఇతర కంపెనీలు అప్రమత్తమవుతున్నాయి. రెడ్‌మీ 7ఏ రిలీజ్ ఎఫెక్ట్‌తో గెలాక్సీ ఎం10 ధరను తగ్గించింది సాంసంగ్. కొంతకాలం క్రితం సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ రిలీజ్ చేసింది. అందులో తక్కువ ధర ఉన్న ఫోన్ గెలాక్సీ ఎం10. రిలీజ్ సమయంలో సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ.7,990 కాగా 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,990. ఇప్పుడు ఈ రెండు వేరియంట్లపై రూ.1,000 తగ్గించింది సాంసంగ్. అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారక వెబ్‌సైట్‌లో తగ్గింపు ధరకే గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.




సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్పెసిఫికేషన్స్డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సెల్స్
ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7870
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,400 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 + సాంసంగ్ ఎక్స్‌పీరియెన్స్ 9.5 యూఎక్స్
కలర్స్: ఓషియన్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్
ధర:
2జీబీ+16జీబీ- రూ.6,990
3జీబీ+32జీబీ- రూ.7,990

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Realme X: బీ రెడీ... 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది

Redmi 7A: షావోమీ నుంచి 'స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్'

Realme C2: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99 ధరకే రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్
First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>