ఇండియాలో రిలీజైన రెడ్‌మీ 6 సిరీస్!

షావోమీ రెడ్‌మీ 6 సిరీస్‌లో మూడు ఫోన్లు ఇండియాలో లాంఛ్ అయ్యాయి. రెడ్‌మీ 6ఏ సేల్ సెప్టెంబర్ 19న, రెడ్‌మీ 6 సేల్, సెప్టెంబర్ 10న, రెడ్‌మీ 6 ప్రో సేల్ సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: September 5, 2018, 3:04 PM IST
ఇండియాలో రిలీజైన రెడ్‌మీ 6 సిరీస్!
షావోమీ రెడ్‌మీ 6 సిరీస్‌లో మూడు ఫోన్లు ఇండియాలో లాంఛ్ అయ్యాయి. రెడ్‌మీ 6ఏ సేల్ సెప్టెంబర్ 19న, రెడ్‌మీ 6 సేల్, సెప్టెంబర్ 10న, రెడ్‌మీ 6 ప్రో సేల్ సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది.
  • Share this:
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన షావోమీ వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూ మార్కెట్‌లో పట్టు పెంచుకుంటోంది. రెడ్‌మీ, ఎంఐ సిరీస్‌లను గతంలోనే యూజర్లకు పరిచయం చేసిన షావోమీ... ఈ మధ్యే పోకో సిరీస్ కూడా లాంఛ్ చేసింది. ఇప్పుడు రెడ్‌మీ 6 సిరీస్‌లో మూడు ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్‌మీ 6 సిరీస్‌లో రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో ఫోన్లున్నాయి.

ఇన్నాళ్లూ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఫోన్లను రిలీజ్ చేసిన షావోమీ ఇప్పుడు మీడియాటెక్ హీలియో ఏ22 చిప్‌సెట్‌తో రెడ్‌మీ 6ఏ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ 2 జీబీ + 16 జీబీ, 3 జీబీ+ 32 జీబీ వేరియంట్లతో రెండు ఫోన్లను పరిచయం చేసింది. రెడ్‌ మీ 5ఏ ఫోన్‌కు అప్‌‌గ్రేడ్ వర్షనే రెడ్‌మీ 6ఏ. మెమొరీ కార్డ్ స్లాట్, ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లున్నాయి. రెడ్‌మీ 6 కూడా మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో తయారైన ఫోనే. 3 జీబీ + 32 జీబీ, 4 జీబీ + 64 జీబీ వేరియంట్లతో రెండు ఫోన్లున్నాయి. ఇక రెడ్‌మీ 6 ప్రో ఎంఐ ఏ2 లైట్ రీబ్రాండ్‌గా చెప్పుకోవచ్చు. నాచ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ మాత్రం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్‌తో రూపొందించింది షావోమీ.

రెడ్‌మీ 6ఏ సేల్ సెప్టెంబర్ 19న, రెడ్‌మీ 6 సేల్ సెప్టెంబర్ 10న, రెడ్‌మీ 6 ప్రో సేల్ సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు Mi.comలో ఈ ఫోన్లు కొనొచ్చు. "దేశ్‌ కా స్మార్ట్‌ఫోన్స్" పేరుతో షావోమీ తీసుకొస్తున్న రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లు యూజర్లను ఎంతమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

Xiaomi Redmi 6A, Redmi 6, Redmi 6 Pro, షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6ఏ


రెడ్‌మీ 6ఏ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 2 జీబీఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ22
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ
ధర:
2 జీబీ + 16 జీబీ- రూ.5,999
3 జీబీ + 32 జీబీ- రూ.6,999

Xiaomi Redmi 6A, Redmi 6, Redmi 6 Pro, షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6


రెడ్‌మీ 6 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
ధర:
3 జీబీ + 32 జీబీ- రూ.7,999
4 జీబీ + 64 జీబీ- రూ.9,499

Xiaomi Redmi 6A, Redmi 6, Redmi 6 Pro, షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6 ప్రో


రెడ్‌మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.84 అంగుళాలఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 2280 x 1080 పిక్సెల్స్
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 9.6
కలర్స్: బ్లాక్, బ్లూ, గోల్డ్, రెడ్
ధరలు:
3 జీబీ + 32 జీబీ- రూ.10,999
4 జీబీ + 64 జీబీ- రూ.12,999

ఇవి కూడా చదవండి:

మోటోరోలా నుంచి మరో రెండు ఫోన్లు!

నాచ్ డిస్‌‌ప్లేతో మోటో పీ30 నోట్!

ఇండియాలో లాంఛైన హానర్ 7ఎస్

Photos: యాపిల్ లాంఛ్ చేసే గ్యాడ్జెట్స్ ఇవేనా?
First published: September 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading