సెప్టెంబర్ 5న షావోమీ 6 సిరీస్ లాంఛింగ్

ఇండియన్ మార్కెట్‌లో పాతుకుపోయిన షావోమీ... కొత్త ఫోన్లతో యూజర్లకు గాలమేస్తోంది. సెప్టెంబర్ 5న షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో ఫోన్లు లాంఛ్ కానున్నాయి.

news18-telugu
Updated: September 4, 2018, 6:21 PM IST
సెప్టెంబర్ 5న షావోమీ 6 సిరీస్ లాంఛింగ్
image: Youtube
  • Share this:
షావోమీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన కంపెనీ ఇది. లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో యూజర్లకు హాట్ ఫేవరెట్‌గా మారింది షావోమీ. ఈ మధ్యే పోకోఫోన్ ఎఫ్1 లాంఛ్ చేసింది. అందరూ ఆ ఫోన్ గురించి చర్చింస్తుండగానే ఇప్పుడు మరిన్ని ఫోన్లతో యూజర్ల ముందుకు రానుంది. రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 5న ఇండియాలో లాంఛ్ చేయనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ట్వీట్ చేశారు షావోమీ ఇండియా హెడ్. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్లు కూడా మీడియా ప్రతినిధులకు వెళ్లాయి.

రెడ్‌మీ 6 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు రానున్నాయని ట్వీట్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆరు అంకె చుట్టూ మూడు ఫోన్లు కనిపిస్తున్నాయి. అవి రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో ఫోన్లు కావచ్చనుకుంటున్నారు ఫ్యాన్స్. వీటి ధరలు రూ.6 వేల నుంచి రూ.14 వేల మధ్యే ఉంటుందని అంచనా. అయితే మీడియాటెక్ ప్రాసెసర్లతో ఈ ఫోన్లు వస్తుండటంతో యూజర్లను ఏమేరకు ఆకర్షిస్తాయన్న చర్చ జరుగుతోంది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో. వాస్తవానికి ఈ మూడు ఫోన్లు జూన్‌లోనే చైనాలో లాంఛ్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

ఇండియాలో లాంఛైన రియల్‌మీ 2

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

Photos: కొత్త ఐఫోన్స్ ఇలానే ఉంటాయా?

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
Published by: Santhosh Kumar S
First published: August 30, 2018, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading