TV Price Hike: టీవీ ధరలు పెరుగుతున్నాయి... ఎందుకంటే

TV Price Hike: టీవీ ధరలు పెరుగుతున్నాయి... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

TV Price Hike | కొత్త టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్. టీవీల ధరలు పెరుగుతున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

  • Share this:
ఇటీవల కాలంలో టీవీల ధరలను అమాంతం పెంచుతున్నాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు. టీవీల తయారీలో ఉపయోగించే ముడిసరుకు ధరలు, సరుకు రవాణా వ్యయలు గడిచిన కొద్ది నెలలుగా అమాంతం పెరగడంతో పాటు కస్టమ్స్ సుంకం కూడా పెరగడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దాదాపు అన్ని కంపెనీలు తమ స్మార్ట్టీవీ ఉత్పత్తులపై 10 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచేశాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు షావోమి, వన్‌ప్లస్, రియల్‌మీతో పాటు సాంసంగ్, ఎల్‌జీ బ్రాండ్లకు చెందిన టీవీలపై 10 నుంచి 15 శాతం మేర ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువ ధరకే స్మార్ట్ ఉత్పత్తులను విక్రయిస్తున్న షావోమీ... భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్లో ముందున్న విషయం తెలిసిందే. అయితే, షావోమీ కూడా గత రెండు నెలల్లో తన టీవీ ధరలను 11 శాతానికి పైగా పెంచేసి అందరికీ షాకిచ్చింది.

Poco Anniversary Sale: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ పోకో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

సరికొత్త ప్రాసెసర్, అదిరిపోయే ఫీచర్స్‌తో రిలీజైన Realme X7 Pro 5G, Realme X7 5G... ధర ఎంతంటే

టెలివిజన్ ధరల పెంపుపై షావోమీ ఇండియా లీడింగ్ మేనేజర్ ఈశ్వర్ నీలకాంతన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టీవీ తయారీదారులు ఉపయోగించే ఓపెన్-సెల్ ప్యానెల్స్ ధరలు అమాంతం పెరిగాయని, ఈ కారణంగా టీవీల ధరలను పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని, మరోవైపు, చైనా, భారత్ మధ్య సరుకు రవాణా ఖర్చు మూడు నుంచి నాలుగు రెట్లు పెరగడం కూడా దీనికి ముఖ్య కారణమని అన్నారు. ఇక, రియల్‌మీ కొద్ది వారాల క్రితమే తన టీవీల ధరలను 15 శాతం పెంచగా, వన్‌ప్లస్ తన స్మార్ట్ టీవీల ధరలను దాదాపు ఏడు శాతం మేర పెంచింది.

Vodafone Idea: ఆ ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.50 డిస్కౌంట్ ప్రకటించిన వొడాఫోన్ ఐడియా

WhatsApp Groups: మీకు చెప్పకుండా వాట్సప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్స్‌తో బ్రేక్ వేయండి

తయారీ, రవాణా ఖర్చులు పెరగడమే కారణం


కాగా, నోయిడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపిఎల్) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాల్లో టాప్లో ఉన్న ఆరు కంపెనీలు తమ టీవీ తయారీలో ఉపయోగిస్తున్న ప్యానెల్ ధరల పెరగడంతో, టీవీ ధరలను కూడా అమాంతం పెంచాల్సి వచ్చిందని, కాగా, కరోనా మహమ్మారి సమయంలో ఈ కంపెనీ ఉత్పత్తులకు ఊహించని డిమాండ్ వచ్చిందని అయితే, సమీప భవిష్యత్తులో వీటి ధరలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ టీవీ తయారీ కంపెనీలైన ఎస్పీపీఎల్ మాదిరిగానే, టీసీఎల్ ఇండియా కూడా ఇటీవల తన టీవీల ధరలను ఏడు నుంచి ఎనిమిది శాతానికి పెంచింది. ధరల పెంపుపై టిసిఎల్ ఇండియా జనరల్ మేనేజర్ మైక్ చెన్ మాట్లాడుతూ టీవీల తయారీకి అవసరమయ్యే ముడి సరుకు దిగుమతి వ్యయం పెరిగిన కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.
Published by:Santhosh Kumar S
First published: