ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!

పోకోఫోన్ సిరీస్‌లో ఎఫ్ 1 స్మార్ట్‌ఫోన్ ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌లో... అది కూడా ఫ్లాష్ సేల్‌లో అందుబాటులో ఉండేది. పోకో ఎఫ్1తో నేరుగా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఢీకొడుతున్న షావోమీ... ఇప్పుడా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను ఆఫ్‌లైన్ మార్కెట్లోకి తీసుకొచ్చేసింది.

news18-telugu
Updated: October 15, 2018, 10:46 AM IST
ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!
Image: News18.com
  • Share this:
షావోమీ పోకో ఎఫ్1... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఓ సంచలనం. గతంలో ఎంఐ, రెడ్‌మీ సిరీస్‌లతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్రవేసిన షావోమీ... పోకో సిరీస్‌తో అడుగుపెడుతూనే సంచలనం సృష్టించింది. తొలి సేల్‌లోనే కేవలం 5 నిమిషాల్లో రూ.200 కోట్ల విలువైన ఫోన్లను అమ్మేసింది షావోమీ. ఆ తర్వాత కూడా పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ ఏమీ తగ్గలేదు.

పోకోఫోన్ సిరీస్‌లో ఎఫ్ 1 స్మార్ట్‌ఫోన్ ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌లో... అది కూడా ఫ్లాష్ సేల్‌లో అందుబాటులో ఉండేది. పోకో ఎఫ్1తో నేరుగా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఢీకొడుతున్న షావోమీ... ఇప్పుడా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను ఆఫ్‌లైన్ మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. సో... ఇకపై మీరు పోకో ఎఫ్‌1 కొనాలంటే ఆన్‌లైన్‌లోకే వెళ్లక్కర్లేదు. ఏదైనా ఆఫ్‌లైన్ స్టోర్‌లో కూడా ఈ ఫోన్ కొనొచ్చు.

5.99 అంగుళాల హెచ్‌డీ+ నాచ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845, అడ్రినో 630 జీపీయూ, లిక్విడ్ కూల్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలు ఫోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌కు ఉన్నాయి.

షావోమీ పోకోఫోన్ ఎఫ్1 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, 2160×1080 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128జీబీ, 256 జీబీప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, ఎంఐయూఐ 9
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: రూసో రెడ్, బ్లూ, బ్లాక్
ధర:
6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్- రూ.20,999
6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ - రూ.23,999
8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ - రూ.28,999
8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్- రూ.29,999 (స్పెషల్ ఎడిషన్)

ఇవి కూడా చదవండి:

నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9

ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
Published by: Santhosh Kumar S
First published: October 15, 2018, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading