Xiaomi: ఏపీలో రెడ్ మీ విస్తరణ... జగన్‌తో భేటీ అయిన ప్రతినిధులు

షావోమీ సంస్థ ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలసి రాష్ట్రంతో తమ కార్యకలాపాల విస్తరణ ప్లాన్లను వివరించారు.

news18-telugu
Updated: July 22, 2019, 11:05 PM IST
Xiaomi: ఏపీలో రెడ్ మీ విస్తరణ... జగన్‌తో భేటీ అయిన ప్రతినిధులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 22, 2019, 11:05 PM IST
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి చూపింది. దీనికి సంబంధించి షావోమీ సంస్థ ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తమ కంపెనీ గురించి, ఏపీలో తమ ప్లాన్ల గురించి వివరించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. షావోమీకి తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఓ ప్లాంట్ ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటిలో ఫాక్స్‌కాన్‌తో కలసి రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏపీలోనే మరో ప్లాంట్‌ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వివిధ కంపెనీలు భారత్‌లో తయారీకి ముందుకొచ్చాయి. భారత్‌లో షావోమీ విక్రయిస్తున్న 95 శాతం ఫోన్లు మనదేశంలోనే తయారవుతున్నాయి.



First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...