XIAOMI PHONES WERE SOLD MORE THAN SAMSUNG AND APPLES IN JUNE 2021 COUNTERPOINT GH VB
Xiaomi: ఆకంపెనీని వెనక్కి నెట్టిన షియోమి.. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా గుర్తింపు..
ప్రతీకాత్మక చిత్రం
Xiaomi: బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల స్మార్ట్ఫోన్లు విక్రయిస్తున్న చైనా కంపెనీ షియోమి మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు ఈ రికార్డు శామ్సంగ్పై ఉండగా.. షియోమీ శామ్సంగ్ను ఆక్రమించేసింది. వివరాలివే..
బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల స్మార్ట్ఫోన్లు విక్రయిస్తున్న చైనా కంపెనీ షియోమి మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు ఈ రికార్డు శామ్సంగ్పై ఉండగా.. షియోమీ శామ్సంగ్ను ఆక్రమించేసింది. మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం, జూన్ 2021లో విడుదలైన గ్లోబల్ ఫోన్ సేల్స్ చార్టులలో షియోమి అగ్రస్థానంలో నిలిచింది. 2021 రెండో త్రైమాసికం వరకు శామ్సంగ్ తర్వాతి స్థానంలో షియోమి ఉండేది. కానీ మే 2021లో షియోమి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 26 శాతం మేర పెరిగాయి. దీంతో శామ్సంగ్ను వెనక్కి నెట్టి షియోమి అగ్రస్థానంలో నిలిచింది. కౌంటర్ పాయింట్ ప్రకారం, షియోమి ప్రస్తుతం 17.1 శాతం మార్కెట్ వాల్యూతో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. శామ్సంగ్ 15.7 శాతంతో రెండవ స్థానంలో, యాపిల్ 14.3 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఓవైపు శామ్సంగ్ సప్లై చైన్ అడ్డంకులు, చైనాపై అమెరికా విధించిన వాణిజ్య ఆంక్షల కారణంగా హువావే ప్రాముఖ్యత పడిపోవడం షియోమికి కలిసొచ్చింది.
మరోవైపు, చైనా స్మార్ట్ బ్రాండ్ హువావేకు పోటీగా ప్రీమియం స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ప్రపంచ అగ్రగామి స్మార్ట్‌ఫోన్ సంస్థగా షియోమి అవతరించింది. దీనిపై కౌంటర్‌పాయింట్‌లోని రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ "హువావే అమ్మకాలు తగ్గినప్పటి నుంచి షియోమీ వేగవంతమైన వృద్ది సాధిస్తోంది. చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లో హువాయి మార్కెట్‌ను షియోమి భర్తీ చేసింది. దీంతో మే, జూన్ నెలల్లో షియోమి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు జూన్‌లో చైనా, యూరప్, భారత్‌లో ఏర్పడ్డ సప్లై చెయిన్ అడ్డంకుల కారణంగా శామ్సంగ్ అమ్మకాలు క్షీణించాయి.
ఇది షియోమి బలపడటానికి పరోక్షంగా కారణమైంది” అని చెప్పారు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమి సంస్థదే అగ్రస్థానమని సీనియర్ కౌంటర్‌పాయింట్ విశ్లేషకుడు వరుణ్ మిశ్రా అన్నారు. షియోమి ఇటీవల ప్రీమియం రేంజ్ స్మార్ట్ఫోన్లపై కూడా దృష్టి పెట్టింది. గత నెలలో Mi 11 సిరీస్ వంటి ప్రీమియం స్మార్ట్ఫోన్లను మార్కెట్లలోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అద్భతుమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది శామ్సంగ్ ఎస్- సిరీస్, నోట్ సిరీస్ ఫోన్లకు గట్టి పోటీనిచ్చింది. తద్వారా, శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పడిపోయాయి. మరోవైపు, శామ్సంగ్ ఇటీవలి కాలంలో కొత్త స్మార్ట్ఫోన్లు ఏవీ విడుదల చేయకపోవడం కూడా షియోమీకి కలిసొచ్చింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.