Xiaomi vs Realme: ఫన్నీ వీడియోతో రియల్‌మీ పరువు తీసిన షావోమీ... ఆ వీడియో ఇదే

Xiaomi vs Realme | రియల్‌మీ తమను కాపీ చేస్తోందంటూ షావోమీ చాలాకాలంగా వాదిస్తోంది. అప్పుడప్పుడూ ఇలాంటి ట్వీట్స్ చేస్తోంది. అయితే వీటిపై రియల్‌మీ ఇంకా స్పందించలేదు.

news18-telugu
Updated: January 21, 2020, 1:33 PM IST
Xiaomi vs Realme: ఫన్నీ వీడియోతో రియల్‌మీ పరువు తీసిన షావోమీ... ఆ వీడియో ఇదే
Xiaomi vs Realme: ఫన్నీ వీడియోతో రియల్‌మీ పరువు తీసిన షావోమీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
షావోమీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఓ సంచలనం. ఆ తర్వాత షావోమీకి సవాల్ విసురుతూ మరో చైనా కంపెనీ రియల్‌మీ వచ్చింది. షావోమీ లాగానే సంచలనాలు సృష్టిస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఈ రెండు కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సేల్స్ పరంగా చూస్తే షావోమీ టాప్‌లోనే ఉన్నా, రియల్‌మీ వేగంగా దూసుకొస్తోంది. అయితే ప్రతీ విషయంలో రియల్‌మీ తమను కాపీ కొడుతోందంటూ షావోమీ వాదిస్తోంది. రియల్‌మీని 'కాపీ క్యాట్' బ్రాండ్‌గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారంలో దూకుడు పెంచింది. సోషల్ మీడియా వేదికగా రియల్‌మీ పరువు తీస్తోంది షావోమీ. షావోమీ ఆన్‌లైన్ పార్ట్‌నర్ సేల్స్ హెడ్, పోకో ఇండియా జీఎం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. షావోమీ బ్రాండ్‌ను ఎలా కాపీకొడుతున్నారో చూపిస్తూ మిస్టర్ బీన్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.



అన్ని ప్రొడక్ట్స్, ఫీచర్స్‌ని రియల్‌మీ కాపీ కొడుతోందని ఈ వీడియో ద్వారా చెబుతోంది షావోమీ. ఇప్పుడే కాదు... రియల్‌మీ తమను కాపీ చేస్తోందంటూ షావోమీ చాలాకాలంగా వాదిస్తోంది. అప్పుడప్పుడూ ఇలాంటి ట్వీట్స్ చేస్తోంది. అయితే వీటిపై రియల్‌మీ ఇంకా స్పందించలేదు.ఇవి కూడా చదవండి:

Realme: మీ దగ్గర ఈ రియల్‌మీ ఫోన్ ఉంటే మీకు గుడ్ న్యూస్

Amazon Great Indian Sale: అమెజాన్‍లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
Published by: Santhosh Kumar S
First published: January 21, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading