Mi A3: ఇండియాకు వచ్చేసిన షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్... ధర రూ.12,999

Xiaomi MI A3 | షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, టియర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: August 21, 2019, 2:28 PM IST
Mi A3: ఇండియాకు వచ్చేసిన షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్... ధర రూ.12,999
Mi A3: ఇండియాకు వచ్చేసిన షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్... ధర రూ.12,999
  • Share this:
విదేశాల్లో రిలీజై ఇండియన్స్‌ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ని ఊరిస్తున్న షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ వన్ సిరీస్‌లో మూడో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో అధికారికంగా రిలీజ్ చేసింది షావోమీ. గతంలో భారతదేశంలో ఎంఐ ఏ1, ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. యూజర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. గతనెలలో స్పెయిన్‌లో రిలీజైన ఎంఐ ఏ3 ఫీచర్స్ అందరికీ తెలిసినవే. షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, టియర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. అయితే ధర ఎంత ఉంటుందోనని షావోమీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇండియాలో రిలీజ్ అయిన షావోమీ ఎంఐ ఏ3 ప్రారంభ ధర రూ.12,999. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొన్నవారికి రూ.750 తగ్గింపు లభిస్తుంది. ఆగస్ట్ 23న అమెజాన్, mi.com, ఎంఐ హోమ్‌లో సేల్ మొదలవుతుంది.

షావోమీ ఎంఐ ఏ3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.08 అంగుళాల హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే

ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 48+8+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,030 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ క్యూ
కలర్స్: నాట్ జస్ట్ బ్లూ, మోర్ ద్యాన్ వైట్, కైండ్ ఆఫ్ గ్రే
ధర:
4జీబీ+64జీబీ- రూ.12,999
6జీబీ+128జీబీ- రూ.15,999

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి

Realme 5: మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ 5'... ధర రూ.9999

Good News: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించిన షావోమీ... లేటెస్ట్ రేట్స్ ఇవే
First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>