హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Xiaomi 12T: షియోమి 12T సిరీస్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా.. అక్టోబర్ 4న లాంచ్.. అధికారికంగా వెల్లడి..!

Xiaomi 12T: షియోమి 12T సిరీస్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా.. అక్టోబర్ 4న లాంచ్.. అధికారికంగా వెల్లడి..!

Xiaomi 12T: షియోమి 12T సిరీస్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా.. అక్టోబర్ 4న లాంచ్.. అధికారికంగా వెల్లడి..!

Xiaomi 12T: షియోమి 12T సిరీస్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా.. అక్టోబర్ 4న లాంచ్.. అధికారికంగా వెల్లడి..!

Xiaomi 12T: ఏకంగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో ఓ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమి. కొత్త 12T సిరీస్‌లో ఈ ఫోన్ రానుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

స్మార్ట్‌ఫోన్ (Smartphone) పరిచయం అయిన మొదట్లో 2 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ కెమెరాలే ఉండేవి. అప్పట్లో 10, 12 మెగా పిక్సెల్ అంటే ఎంతో గొప్పగా చెప్పుకొనేవారు. అయితే టెక్నాలజీ (Technology) కొత్త పుంతలు తొక్కుతుండడంతో స్మార్ట్‌ఫోన్లలో వెరైటీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 50 మెగా పిక్సెల్ కెమెరా అనేది అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లలో కామన్ అయింది. అయితే ఇప్పుడు ఏకంగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో ఓ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమి (Xiaomi). కొత్త 12T సిరీస్‌లో ఈ ఫోన్ రానుంది. అయితే ఈ లైనప్‌లోని రెండు మోడల్స్‌లో ఒకే సెన్సార్‌ ఉంటుందో లేదో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ‘ప్రో’ వేరియంట్‌లో మాత్రం 200 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

* అక్టోబర్ 4న జర్మనీలో లాంచ్

ప్రస్తుతం, మార్కెట్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఏకైక స్మార్ట్‌ ఫోన్‌గా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా (Moto Edge 30 Ultra) చరిత్ర సృష్టించింది. అతి త్వరలో ఈ జాబితాలోకి షియోమి రెండో బ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. షియోమి 12T సిరీస్ అక్టోబర్ 4న జర్మనీలో లాంచ్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షియోమి12 సిరీస్‌కి ఇది కొనసాగింపుగా రానుంది.

ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో లీ జున్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. షియోమి 12T సిరీస్‌లో వచ్చే 200 మెగా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లను లీ జున్ పంచుకున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లెటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో వస్తుందన్నారు. ఇందులో కనీసం 12GB RAM ఉంటుందన్నారు. ఈ న్యూ హై-ఎండ్ డివైజ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బెస్ట్ ఫర్ఫార్మెన్స్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. షియోమి12T ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ వినియోగించినట్లు తెలుస్తోంది. అలాగే 108-మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ‘షియోమి12S అల్ట్రాతో కంపెనీ కెమెరాలలో నాణ్యత మెరుగు పడింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాలేదు. దీంతో త్వరలో లాంచ్ చేయబోతున్న తదుపరి అల్ట్రా ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.’ అని లీ జున్ పేర్కొన్నారు.

* ఇతర ఫీచర్ల వివరాలు..

షియోమి 12‌టీ సిరీస్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్ కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది 5,000mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ సపోర్ట్, ఫుల్ HD+ అండ్ 2K రిజల్యూషన్ సపోర్ట్‌తో కూడిన బిగ్ AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో రానున్నట్లు సమాచారం. ‘200-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను శామ్‌సంగ్ డెవలప్ చేసింది. షియోమి తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం శామ్‌సంగ్‌కు చెందిన HP1 సెన్సార్‌ను వినియోగించబోతున్నట్లు అనేక రిపోర్ట్స్ కూడా వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు కంపెనీ రిలీజ్ చేసిన ప్రొడక్ట్ టీజర్లలో లైకా లేదు. అయితే తాజా Xiaomi ఫ్లాగ్‌షిప్ డివైజ్‌తో దాని భాగస్వామ్యం కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం’ అని లీ జున్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Smartphones, Tech news, Xiaomi