Home /News /technology /

XIAOMI OFFERS FREE SMARTPHONE FOR WINNERS WHO SHOP ON XIAOMI INDIA WEBSITE DURING DIWALI WITH MI SALE SS

Free Smartphone: ఈ ఒక్క పని చేస్తే చాలు... షావోమీ నుంచి ఉచితంగా స్మార్ట్‌ఫోన్

Free Smartphone: ఈ ఒక్క పని చేస్తే చాలు... షావోమీ నుంచి ఉచితంగా స్మార్ట్‌ఫోన్
(image: Xiaomi India)

Free Smartphone: ఈ ఒక్క పని చేస్తే చాలు... షావోమీ నుంచి ఉచితంగా స్మార్ట్‌ఫోన్ (image: Xiaomi India)

Diwali With Mi Sale | దివాళీ విత్ మీ (Diwali With Mi) సేల్‌లో షాపింగ్ చేసినవారికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్ (Free Smartphone) గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది షావోమీ ఇండియా. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

    ప్రతీ ఏటా దసరా, దీపావళి సీజన్‌లో షావోమీ ఫెస్టివల్ సేల్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా దివాళీ విత్ మీ (Diwali With Mi) సేల్ ప్రకటించింది. ఆఫర్స్ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు కానీ... ఓ అద్భుతమైన ఆఫర్‌ను ముందే ప్రకటించేసింది. ఈ ఆఫర్‌తో షావోమీ ఫ్యాన్స్ ఉచితంగా స్మార్ట్‌ఫోన్ (Free Smartphone) పొందొచ్చు. అవును... షావోమీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. ఒక్కసారి కాదు... ప్రతీ రెండేళ్లకు ఓసారి 20 ఏళ్ల వరకు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్ ఇస్తామని ప్రకటించింది షావోమీ ఇండియా. మీరు చేయాల్సిందల్లా షావోమీ ఇండియా వెబ్‌సైట్ అయిన Mi.com లో షాపింగ్ చేయడమే. షాపింగ్ చేసిన తర్వాత ఓ రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి. డ్రా ద్వారా విజేతల్ని ఎంపిక చేస్తారు. గెలిచినవారికి ప్రతీ రెండేళ్లకు ఓ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా ఇస్తారు. ఇలా 20 ఏళ్ల పాటు ఫ్రీగా స్మార్ట్‌ఫోన్ పొందొచ్చు.

    Vivo Smartphone Offers: అమెజాన్ సేల్‌లో 6 వివో స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు తగ్గింపు

    షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో షాపింగ్ చేయడం ద్వారా ఎక్స్‌క్లూజీవ్ ప్రొడక్ట్స్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు రివార్డ్ మీ డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. డివైజ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. ఇక షావోమీ రిలీజ్ చేసే కొత్త ప్రొడక్ట్స్‌కి ప్రియార్టీ యాక్సెస్ లభిస్తుంది. వీటన్నింటితో పాటు 20 ఏళ్ల వరకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్ పొందే అవకాశం రావొచ్చు. దివాళీ విత్ మీ (Diwali With Mi) సేల్‌లో భాగంగా ప్రస్తుతం ప్రీ-బుకింగ్ సేల్ జరుగుతోంది. కొన్ని ప్రొడక్ట్స్‌ని ఆఫర్ ధరకే ముందే బుక్ చేసుకోవచ్చు.

    Samsung Galaxy M32 5G: రిలీజ్ అయిన నెల రోజులకే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,000 తగ్గింది

    Diwali with Mi free smartphone, Diwali with Mi offers, Diwali with Mi sale, how to get free smartphone, redmi smartphone offers, xiaomi free smartphone offers, xiaomi smartphone offers, ఉచితంగా స్మార్ట్‌ఫోన్, దివాలీ విత్ మీ సేల్, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, షావోమీ ఆఫర్స్
    (image: Xiaomi India)


    దివాళీ విత్ మీ సేల్‌లో లభించే ఆఫర్స్ షావోమీ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా లభిస్తాయి. దివాళీ విత్ మీ సేల్ విషయానికి వస్తే ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు రెండు ప్రొడక్ట్స్ ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌తో లభిస్తాయి. ఉదయం 10 గంటలకు జాక్‌పాట్ డీల్స్ ఉంటాయి. ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు x99 స్టోర్‌లో వస్తువుల్ని తక్కువ ధరకే కొనొచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ కేవలం రూ.99 ధరకే ఫ్లాష్ సేల్‌లో లభిస్తాయి.

    Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ముందే మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ 15 మొబైల్స్‌పై డిస్కౌంట్

    దివాళీ విత్ మీ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దివాళీ విత్ మీ సేల్‌లో లభించే ఆఫర్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కూడా లభిస్తాయి. అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో, ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Sbi card, Smartphone, Xiaomi

    తదుపరి వార్తలు