అడ్వాన్సుడ్ ఫీచర్లతో షియోమి ఎంఐ వాచ్ రివాల్వ్.. ధర ఎంతంటే?

షియోమీ కంపెనీ ఎంఐ వాచ్ రివాల్వ్ పేరుతో ఓ నూతన స్మార్ట్ వాచ్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పదివేల రూపాయిలలోపు లభించే ఈ స్మార్ట్వాచ్లో అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.

news18-telugu
Updated: October 8, 2020, 3:32 PM IST
అడ్వాన్సుడ్ ఫీచర్లతో షియోమి ఎంఐ వాచ్ రివాల్వ్.. ధర ఎంతంటే?
ఎంఐ వాచ్ రివాల్వ్
  • Share this:
షియోమీ కంపెనీ ఎంఐ వాచ్ రివాల్వ్ పేరుతో ఓ నూతన స్మార్ట్ వాచ్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పదివేల రూపాయిలలోపు లభించే ఈ స్మార్ట్వాచ్లో అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. అక్టోబర్ 6న లాంఛ్ అయిన ఈ వాచ్ను ఎంఐ.కామ్, అమెజాన్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ 46 ఎంఎం వేరియంట్లో లభిస్తుంది. అంతేకాక, దీనిలో క్రోమ్ సిల్వర్ మరియు మిడ్నైట్ బ్లాక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో వస్తుంది. దీనిలో మిడ్నైట్ బ్లాక్ ఇన్ లెదర్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ డస్ట్ మెరూన్, స్పేస్ బ్లాక్ మరియు ఆస్ట్రల్ ఆలివ్ అనే 5 పట్టీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మీ వాచ్ను మల్టిపుల్ కలర్స్తో అట్రాక్టివ్‌గా చేస్తుంది. దీనిలో ఉన్న మల్టిపుల్ కలర్స్లో నుండి మీకు నచ్చిన కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇందులో ఉండే 46 మిల్లీ మీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ మీ వాచ్ను అందంగా కనిపించేలా చేస్తుంది. ఈ వాచ్ చాలా సన్నగా ఉండటంతో మీ మణికట్టుకు సులభంగా పడుతుంది. దీన్ని ఎంఐ మొబైల్ యాప్‌తో అనుసందానించవచ్చు. వాచ్ కింది భాగంలో హార్ట్ రేట్ సెన్సార్ మరియు ఛార్జర్ కోసం కనెక్టర్లతో సహా వివిధ సెన్సార్లు ఉన్నాయి. ఈ వాచ్ 40 గ్రాములు బరువుండి, మీ చేతికి తేలికగా అమర్చడానికి వీలవుతుంది.

ఎంఐ వాచ్ రివాల్వ్ స్పెసిఫికేషన్స్
-ఎంఐ వాచ్ రివాల్వ్ 46 ఎంఎం డయల్తో ఆకర్షనీయంగా ఉంటుంది. దీనిలోని1.39 -అంగుళాల అమోల్డెడ్ డిస్ప్లే హ పిక్చర్ రిజల్యూషన్తో వస్తుంది. ఈ ఇది 45 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో లభిస్తుంది.
-దీనిలో ఉండే బ్లూటూత్ 5.0 బిఎల్ఈ ద్వారా మీ మొబైల్కు కనెక్ట్ చేసుకోవచ్చు. షియోమీ వియర్ యాప్ ద్వారా కూడా ఈ వాచ్ను కెనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ 420 ఎంఏహెచ్తో బ్యాటరీ వస్తుంది. దీంతో ఈ వాచ్ దాదాపు రెండు వారాల పాటు సింగిల్ ఛార్జింగ్తో పనిచేయగలదు.
-అంతేకాక ఒక్క సారి ఛార్జ్ చేస్తే 20 గంటల పాటు జీపీఎస్ను ఉపయోగించుకోవచ్చు. దీనిలోని బ్యాటరీ మొత్తం చార్జ్ అవ్వడానికి సుమారు రెండున్నర గంటల సమయం మాత్రమే పడుతుంది. ఈ వాచ్లో వైఫై. జీపీఎస్, గ్లోనస్ కనెక్టివిటీ వంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
-దీనిలోని సెన్సార్లు ఎప్పటికప్పుడు హార్ట్ రేటును గమనిస్తూ ఉంటాయి. ఫస్ట్ బీట్ మోషన్ అల్గారిథమ్ ద్వారా ఇది పని చేస్తుంది. దీనిలో మొత్తం 10 రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. రన్నింగ్, సైక్లింగ్, టెక్కింగ్, ట్రెడ్మిల్, వర్క్అవుట్ వంటి వాటికి ఈ వాచ్ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది.

-మీ మొబైల్కు వచ్చే నోటిఫికేషన్స్, వెదర్ రిపోర్ట్, మ్యూజిక్ కంట్రోల్, అలారం వంటి వాటిని ఈ స్మార్ట్ వాచ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. రూ .9,999 ధరలో లభించే ఈ స్మార్ట్ వాచ్ ఈ ధరలో శ్రేణిలో ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. విస్తృతమైన ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లు, స్ట్రెస్ మరియు ఎనర్జీ డేటా యాడ్-ఆన్లు మరియు మంచి బ్యాటరీ స్టామినాతో ఈ వాచ్ అగ్రస్థానంలో ఉంది.
Published by: Sumanth Kanukula
First published: October 8, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading