Mi TV 4A: షియోమీ నుంచి 41 అంగుళాల డిస్‌ప్లేతో ఎంఐ 4ఏ టీవీ...ధర ఎంతంటే...

(image: ప్రతీకాత్మకచిత్రం)

Mi TV 4A: మరో కొత్త టీవీని విడుదల చేయనున్న షియోమీ.. 41 అంగుళాల డిస్‌ప్లేతో రానున్న ఎంఐ 4ఏ టీవీ

  • Share this:
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ షియోమీ.. స్మార్ట్ ఫోన్లే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలోనూ ముందంజలో ఉంది. ఆ సంస్థ అత్యుత్తమ టీవీలను భారత మార్కెట్లో విడుదల చేస్తూ మంచి అమ్మకాలు అందుకుంటోంది. త్వరలో సరికొత్త Mi TV 4A 40 హారిజాన్ ఎడిషన్ ను భారత విపణిలో లాంచ్ చేయనుంది. జూన్ 1న ఈ ఎంఐ టీవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2019లో లాంచ్ అయిన Mi TV 4A 40 టీవీకి అప్‌డేటెడ్ మోడల్ గా ఇది రానుంది. ఇది 41-అంగుళాల డిస్ ప్లేతో రానుంది. ఇప్పటికే ఈ హారిజాన్ ఎడిషన్ లైనప్ లో 32, 43-అంగుళాల డిస్ ప్లేతో వచ్చిన టీవీలు విజయవంతమయ్యాయి.

ధర, ఫీచర్లు..
షియోమీ సోషల్ మీడియా ఛానళ్లలో ఉన్న ప్రమోషనల్ పోస్టర్లను గమనిస్తే.. అన్ని పక్కల పూర్తి స్లిమ్ గా ఉండి ఆకట్టుకుంటోందీ మోడల్. అయితే ఈ టీవీకి సంబంధించి ధర, స్పెసిఫికెషన్ల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లాంచింగ్ రోజు పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. ఈ సరికొత్త ఎంఐ టీవీ ఫుల్ HD(1920X1080) రిజల్యూషన్‌తో, 60 HZ రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న Mi TV 4A 40 మోడల్ రూ.22,999కు లభ్యమవుతుంది. అంతేకాకుండా ఇది బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో అందుబాటులోకి వచ్చింది. 32-అంగుళాల డిస్ ప్లే ఉన్న Mi TV 4A 40 హారిజాన్ ఎడిషన్ ధర రూ.15,999గా ఉంది. 43 అంగుళాల డిస్ ప్లే ఉన్న మోడల్‌ను రూ.25,999లకు కొనుగోలు చేసుకోవచ్చు. వీటి ధరల ప్రకారం చూస్తే.. త్వరలో రానున్న కొత్త Mi TV 4A 40 హారిజాన్ ఎడిషన్ మోడల్ 22 వేల నుంచి 26 వేల మధ్య ఉండే అవకాశముంది.

పాత ఫీచర్లన్నీ ఉంటాయి..
ఫీచర్లపరంగా చూసుకుంటే ఇతర హారిజాన్ వేరియంట్లలో ఉన్న ప్రత్యేకతలన్నీ ఇందులోనూ ఉండనున్నాయి. బెజెల్ లెస్ డిజైన్ తో పాటు ఫుల్ HD డిస్ ప్లేతో కూడిన 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, 20 వాట్ల వరకు ఆడియో ఔట్ పుట్ ఇచ్చే DTS-HD సపోర్టింగ్ స్పీకర్లు, రెండు యూఎస్బీ పోర్టులు, మూడు HDMI పోర్టులు సింగిల్ ఇయర్ ఫోన్ పోర్టులు లాంటివి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా Mi TV 4A 43 హారిజన్ మోడల్లో క్వాడ్ కోర్ యామ్ లాజిక్ కోర్టిక్స్ ఏ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ, Mali-450జీపీయు ఇందులో ఉన్న అదనపు ప్రత్యేకతలు. డ్యూయల్ బాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ వీ4.2 లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.

పాత Mi TV 4A 40-అంగుళాల మోడల్లో ఫుల్ HD డిస్ ప్లే ప్యానెల్ ఉంది. DTS-HD ఆడియో స్పీకర్లతో పాటు 2.4GHZ వైఫై ఆప్షన్ ఉంది. ఇవి కాకుండా పాత మోడళ్లలో ఉండే ఇతర కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో రానున్నాయి. ఇతర ప్రత్యేకతలు గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
Published by:Krishna Adithya
First published: