LED Bulbs: షియోమి స్మార్ట్ ఎల్ఈడీ బల్బులు.. ఫోన్‌తో ఆపరేట్ చేసుకునే సదుపాయం

Xiaomi LED Bulb: ఈ స్మార్ట్ బల్బుల్ని మీ స్మార్ట్ ఫోన్‌లోని గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి స్మార్ట్ అసిస్టెంట్స్‌తో వాయిస్ కమాండ్స్ జారీ చేసి దీన్ని కంట్రోల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

news18-telugu
Updated: September 23, 2020, 5:47 PM IST
LED Bulbs: షియోమి స్మార్ట్ ఎల్ఈడీ బల్బులు.. ఫోన్‌తో ఆపరేట్ చేసుకునే సదుపాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
షియోమి సంస్థ స్మార్ట్ గృహోపకరణాల శ్రేణిలో భాగంగా తాజాగా స్మార్ట్ ఎల్ఈడి బల్బ్(బి22)ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ బల్బుల్ని మీ స్మార్ట్ ఫోన్‌లోని గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి స్మార్ట్ అసిస్టెంట్స్‌తో వాయిస్ కమాండ్స్ జారీ చేసి దీన్ని కంట్రోల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ 9 వాట్స్ విద్యుత్‌ను వినియోగించుకుంటూ, 900 లూమెన్స్ వెలుతురును అందిస్తుంది. అంతేకాక ఇది 16 మిలియన్ రంగులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే B22 బల్బ్ సాకెట్ దీనికి కూడా సరిపోతుంది. ఈ బల్బ్ పాలికార్బోనేట్, ప్లాస్టిక్ ధరించిన అల్యూమినియం నుండి తయారవుతుంది. దీన్ని మొబైల్ యాప్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్‌లలో అందుబాటులో ఉన్న ఎంఐ హోమ్ యాప్ ద్వారా మీ ఇంట్లోని వైఫైకి కనెక్ట్ చేస్తే మనం ఇచ్చే వాయిస్ కమాండ్లను ఇది స్వీకరించి వాటికి తగ్గట్లు నడుచుకోవడం చేస్తుంది. అంతేకాక ఈ యాప్‌ను ఉపయోగించి మీకు ఇష్టమైన రంగును ఎంచుకోవచ్చు.

ఈ స్మార్ట్ బల్బ్ యొక్క జీవిత కాలం ఏకంగా 25,000 గంటలు.. అంటే 11 సంవత్సరాలు ఉంటుందని షియోమీ సంస్థ చెబుతోంది. రోజుకు సగటున ఆరు గంటల పాటు మీరు ఈ బల్బును ఉపయోగిస్తే 11 ఏళ్ల జీవితకాలం లభిస్తుందని షియోమీ తన వెబ్ ‌సైట్‌లో తెలిపింది.

కేవలం 799 రూపాయలకే..
ఈ స్మార్ట్ ఎల్ఈడీ బల్బ్ (బి 22) కేవలం 799 రూపాయలకే లభిస్తుంది. ఈ బల్బ్ వైట్ బాడీని కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో ఎంఐ డాట్ కామ్ సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇదివరకే షియోమి తన పోర్ట్ఫోలియోలో ఎంఐ ఎల్ఈడీ వైఫై స్మార్ట్ బల్బ్ అనే మరో బల్బ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది10W పవర్ రేటింగ్తో 800 ల్యూమన్ ప్రకాశవంతమైన కాంతిని అందిస్తుంది. దీనిలో కూడా కొత్తగా విడుదలైన స్మార్ట్ ఎల్ఇడి బల్బ్ (బి 22) లాగే అన్ని ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ E27 బేస్ కనెక్షన్తో ఈ బల్బ్ వస్తుండటం దీని ప్రత్యేకత. కాగా ఆన్‌లైన్‌లో ప్రస్తుతం దీని ధర 1,299 రూపాయలుగా ఉంది. కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఎల్ఈడీ బల్బ్ కంటే దీని ధర ఎక్కువ.
Published by: Kishore Akkaladevi
First published: September 23, 2020, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading