హోమ్ /వార్తలు /technology /

Mi Pay: ప్లే స్టోర్‌లో రిలీజైన 'ఎంఐ పే'... గూగుల్‌ పే, పేటీఎంకు పోటీ

Mi Pay: ప్లే స్టోర్‌లో రిలీజైన 'ఎంఐ పే'... గూగుల్‌ పే, పేటీఎంకు పోటీ

Mi Pay Download | రీఛార్జ్‌లు, బిల్ పేమెంట్స్ లాంటి సేవల కోసం 'ఎంఐ పే' యాప్‌ను ఉఫయోగించుకోవచ్చు. అయితే ఇందులో లాగిన్ కావాలంటే ఎంఐ అకౌంట్ ఉండాలి.

    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన షావోమీ... పేమెంట్ సర్వీస్ 'ఎంఐ పే' ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం షావోమీ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. షావోమీ ఫోన్లల్లో ఇన్‌బిల్ట్‌గా ఈ యాప్ వస్తోంది. ఎంఐ యాప్‌ స్టోర్‌లో మాత్రమే ఈ యాప్ లభించేది. ఇప్పుడు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చేసింది. 'ఎంఐ పే' యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... రీఛార్జ్‌లు, బిల్ పేమెంట్స్ లాంటి సేవల కోసం 'ఎంఐ పే' యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో లాగిన్ కావాలంటే ఎంఐ అకౌంట్ ఉండాలి.

    ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి 'ఎంఐ పే' యాప్‌ను రూపొందించింది షావోమీ. ఇప్పటికే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ అనేకం ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా 'ఎంఐ పే' అందుబాటులోకి రావడంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంకు గట్టి పోటీ తప్పదని అంచనా. ఈ యాప్స్‌లో ఉన్నట్టుగానే 'ఎంఐ పే' యాప్‌లో సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, మొబైల్ రీఛార్జెస్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, గ్యాస్ బిల్ పేమెంట్స్, వాటర్ బిల్ పేమెంట్స్, డీటీహెచ్ పేమెంట్స్ లాంటి సేవలు ఉన్నాయి. భారతదేశంలో వ్యాలెట్ సేవలపై కన్నేసిన షావోమీ... ఈ రంగంలో అడుగుపెట్టేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

    తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి

    ఇవి కూడా చదవండి:

    Post Box App: మీ ఫోన్‌కు మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ ఒక్క యాప్‌తో చెక్ పెట్టొచ్చు

    Charminar Express: గుడ్ న్యూస్... త్వరలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు... ప్రత్యేకతలివే

    EPFO Alert: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ అలర్ట్ మెసేజ్

    First published:

    ఉత్తమ కథలు