XIAOMI MI PAD 5 XIAOMI LAUNCHES MI PAD 5 TABLET SOON PRICE SPECIFICATION DETAILS HERE GH VB
Xiaomi Mi Pad 5: షియోమి నుంచి త్వరలోనే ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్ లాంచ్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు..
ప్రతీకాత్మక చిత్రం
షియోమి ఇండియా అతి త్వరలోనే తన ఎంఐ ప్యాడ్ లైనప్‌లో మరో ట్యాబ్లెట్‌ను జోడించేందుకు సిద్దమవుతోంది. కంపెనీ వచ్చే వారం ఎంఐ ప్యాడ్ 5 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. షియోమి మంగళవారం నాడు దీనికి సంబంధించిన ఒక టీజర్‌ను షేర?
ప్రముఖ మొబైల్(Mobile) తయారీ సంస్థ షియోమి(Xiomi) కేవలం స్మార్ట్‌ఫోన్(Smart Phone) మార్కెట్లోనే కాదు ట్యాబ్లెట్ మార్కెట్లోనూ దూసుకుపోతుంది. తన ఎంఐ(MI) కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ట్యాబ్లెట్లను అందుబాటులోకి తెస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన మోడళ్లను(Models) సరసమైన ధరలోనే విడుదల చేస్తుంది. షియోమి ఇండియా(Xiomi India) అతి త్వరలోనే తన ఎంఐ ప్యాడ్ లైనప్‌లో మరో ట్యాబ్లెట్‌ను(Tablets) జోడించేందుకు సిద్దమవుతోంది. కంపెనీ(Company) వచ్చే వారం ఎంఐ ప్యాడ్ 5 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి(Market) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. షియోమి మంగళవారం నాడు దీనికి సంబంధించిన ఒక టీజర్‌ను షేర్(Share) చేసింది.
ఈ టీజర్‌కు "లెట్స్ ట్యాబ్" అనే క్యాప్షన్ ఇచ్చింది. అంటే, త్వరలోనే కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేయనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ టీజర్ వీడియోలో కౌంట్‌డౌన్ కూడా యాడ్ చేసింది. 2 రోజుల 18 గంటల్లో కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తెస్తున్నామని తెలిపింది. అంటే, కౌంట్ డౌన్‌ను బట్టి చూస్తే ఏప్రిల్ 1న ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, షియోమి తన యూజర్లపై ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ చేసే అవకాశం కూడా ఉంది. కాగా, నిజంగానే ఏప్రిల్ 1న ప్యాడ్ 5 ట్యాబ్లెట్ మార్కెట్లోకి వస్తుందని టెక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, షియోమి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఎంఐ ప్యాడ్ 5 మోడల్‌ను ధ్రువీకరించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఎంఐ ప్యాడ్ 5 టాబ్లెట్ సరసమైన ధర ట్యాగ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
షియోమి ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్‌ను కంపెనీ కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. ఇది మిడ్‌రేంజ్ టాబ్లెట్‌గా మార్కెట్లోకి వస్తుంది. ఈ ట్యాబ్లెట్ 6GB ర్యామ్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 256GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఎంఐ ప్యాడ్ 5 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతిచ్చే 11-అంగుళాల WQHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ టాబ్లెట్ 13 -మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో 8- మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను అందించనుంది.
ఎంఐ ప్యాడ్ 5లో డాల్బీ అట్మోస్‌తో నడిచే క్వాడ్ స్పీకర్లు ఉంటాయి. ఇది ప్రయాణంలో సినిమాలు చూడటానికి అనుకూలంగా ఉంటుంది. షియోమి ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్ MIUI ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. సుదీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్ కోసం 8720mAh బ్యాటరీని అమర్చే అవకాశం ఉంది. షియోమి ఎంఐ ప్యాడ్5 లాంచ్ తేదీతో సహా ఫీచర్లు, ధర వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.