Home /News /technology /

XIAOMI MI PAD 5 TABLET TO BE LAUNCHED IN INDIA XIAOMI 12 PRO WITH SMARTPHONE AND TAB LAUNCH GH VB

Xiaomi: త్వరలో షియోమి Mi Pad 5 టాబ్లెట్.. షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు ట్యాబ్ లాంచ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనీస్ స్మార్ట్‌ బ్రాండ్ షియోమి ఇండియన్ మార్కెట్లో వివిధ రకాల ప్రొడక్ట్స్ విడుదల చేస్తూ దూసుకుపోతుంది. ఈ నెలలో ఏకంగా రెండు మేజర్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ ఇండియాలో లాంచ్ చేయనుంది. ఏప్రిల్‌ చివరిలోగా ఇవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

చైనీస్ స్మార్ట్‌ బ్రాండ్ షియోమి(Xiomi) ఇండియన్ మార్కెట్లో(Indian Market) వివిధ రకాల ప్రొడక్ట్స్(Products) విడుదల చేస్తూ దూసుకుపోతుంది. ఈ నెలలో ఏకంగా రెండు మేజర్ ప్రొడక్ట్స్‌ను(Major Products) కంపెనీ ఇండియాలో లాంచ్ చేయనుంది. ఏప్రిల్‌ చివరిలోగా ఇవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ షియోమి 12 ప్రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను(Smartphone) ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఇదే సమయంలో Mi Pad 5 టాబ్లెట్‌ను(Tablet) కూడా లాంచ్ చేయనున్నట్లు షియోమి ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను(Teaser) కూడా కంపెనీ రిలీజ్ చేసింది. Mi Pad 5 టాబ్లెట్‌లో iPad వంటి సొంత యాక్ససరీస్ ఉంటాయి. Mi Pad 5, Mi Pad 5 Pro టాబ్లెట్‌లను కంపెనీ ఒకేసారి మార్కెట్‌కి తీసుకువచ్చే అవకాశం ఉంది.

షియోమి ఈ నెలలో పెద్ద ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌కి తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ బ్రాండ్‌ ప్రొడక్ట్స్ కోసం ఎదురుచూసే కస్టమర్లను తాజా ఫోన్, ట్యాబ్ ఆకట్టుకుంటాయని కంపెనీ భావిస్తోంది. Xiaomi 12 Pro స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. క్వాలిటీ కెమెరాలతో కంపెనీ ఈ డివైజ్‌ను తయారు చేసింది. కానీ Mi Pad 5 గురించి మరిన్ని వివరాలను షియోమి వెల్లడించలేదు. తక్కువ ధరలో లభిస్తూ ఇతర ప్రీమియం టాబ్లెట్‌లలోని ఫీచర్లను కంపెనీ అందించే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్ గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు చూద్దాం.

Work From Home: ఇక ఆఫీస్ లకు ఎండ్ కార్డు పడినట్లేనా..! భవిష్యత్తులో కూడా కొనసాగనున్న వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానం..


* MI ప్యాడ్ 5 టాబ్లెట్ స్పెసిఫికేషన్లు
షియోమి Mi Pad 5 తయారీ గురించి కొన్ని నెలల క్రితమే హింట్ ఇచ్చింది. యూజర్ల కోసం రీజనబుల్ ప్రైజ్ రేంజ్‌లో మిడ్ రేంజ్ టాబ్లెట్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది 6GB RAMతో స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 256GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఎమ్‌ఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్ 11-అంగుళాల WQHD + రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ టాబ్లెట్‌లో 13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. Mi Pad 5లో డాల్బీ అట్మోస్‌ సపోర్ట్ ఉండే క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇది ప్రయాణంలో సినిమాలు చూడటానికి ఉపయోగపడుతుంది. ఈ ట్యాబ్ MIUIతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదని కంపెనీ చెబుతుంది. ఎక్కువ బ్యాకప్ ఇచ్చే 8720mAh బ్యాటరీ దీని సొంతం. ఈ స్పెసిఫికేషన్ల ప్రకారం చూస్తే, Xiaomi Mi Pad 5 ధర మార్కెట్‌లో రూ. 40,000 కంటే తక్కువగా ఉండటం కష్టం. కానీ కంపెనీ కొన్నేళ్లుగా తక్కువ ధరల్లోనే అందరినీ ఆశ్చర్యపరిచే ప్రొడక్ట్స్ అందిస్తోంది. ఇలా చూస్తే ధర ఇంకాస్త తగ్గవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Smartphones, Technology, Xiomi

తదుపరి వార్తలు