Mi Home Security Camera: షావోమీ నుంచి సెక్యూరిటీ కెమెరా... జస్ట్ రూ.1,999

Xiaomi Mi Home Security Camera | ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరాలో బిల్ట్ ఇన్ బ్లూటూత్ చిప్, నాయిస్ క్యాన్సలింగ్ మైక్రోఫోన్, మైక్రో ఎస్‌డీ కార్డ్స్ లాంటి ఫీచర్లున్నాయి. 10 మీటర్ల దూరం వరకు దృశ్యాలను క్యాప్చర్ చేయగలదు.

news18-telugu
Updated: February 13, 2019, 6:35 PM IST
Mi Home Security Camera: షావోమీ నుంచి సెక్యూరిటీ కెమెరా... జస్ట్ రూ.1,999
Mi Home Security Camera: షావోమీ నుంచి సెక్యూరిటీ కెమెరా... జస్ట్ రూ.1,999
  • Share this:
ముందు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో... తర్వాత టీవీ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన షావోమీ ఆ తర్వాత కొత్తకొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేస్తోంది. ఇప్పుడు 'ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ 1080p' లాంఛ్ చేసింది. షావోమీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ mi.com వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కెమెరా కొనొచ్చు. అసలు ధర రూ.2,299 కాగా... ఆఫర్‌లో రూ.1,999 ధరకే అమ్ముతున్నారు.


ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరాలో ఏఐ మోషన్ డిటెక్షన్, బిల్ట్ ఇన్ బ్లూటూత్ చిప్, నాయిస్ క్యాన్సలింగ్ మైక్రోఫోన్, మైక్రో ఎస్‌డీ కార్డ్స్ లాంటి ఫీచర్లున్నాయి. 10 మీటర్ల దూరం వరకు దృశ్యాలను క్యాప్చర్ చేయగలదు. 130 డిగ్రీల కోణంలో ఫుల్ హెచ్‌డీ 1080పీ దృశ్యాలను రికార్డ్ చేయగలదు. ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ ఫీచర్ కూడా ఉంది. యాప్‌తో కనెక్ట్ చేసినప్పుడు టాక్ బ్యాక్ ఫీచర్ పనిచేస్తుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్, మల్టీ టాస్కింగ్‌ను యాప్ సపోర్ట్ చేస్తుంది.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

ఇవి కూడా చదవండి:

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...
Published by: Santhosh Kumar S
First published: February 13, 2019, 6:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading